తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆలీ షోకు గెస్ట్​గా పవన్​ కల్యాణ్​.. నిజమేనా? - పవన్​కల్యాణ్​పై ఆలీ కామెంట్స్​

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​.. కమెడియన్​ ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా టాక్ షోకు వస్తారని ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆలీనే స్వయంగా చెప్పినట్లు ఓ చిన్న క్లిప్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది.

Pawankalyan alitho saradaga
ఆలీ షోకు పవన్​ కల్యాణ్​.. నిజమేనా?

By

Published : Oct 28, 2022, 10:04 PM IST

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ ఈ పేరుకు ఉన్న క్రేజ్​ తెలిసిందే. తెరపై ఆయన కనిపిస్తే చాలు ఫ్యాన్స్​కు పూనకాలే. అయితే ఆయన ఓటీటీలో ప్లాట్​ఫామ్​లో దూసుకుపోతున్న నందమూరి నటసింహం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్​స్టాపబుల్​కు వస్తారని ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరో టాక్​ షోకు వెళ్తారని బుల్లితెరపై సందడి చేస్తారని వినిపిస్తోంది. ఈ విషయాన్ని కమెడియన్​ ఆలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనికి సంబంధించిన ఓ చిన్న క్లిప్​ సోషల్​మీడియాలో వైరల్ అవుతోంది.

ఇందులో 'మీ షోకు కల్యాణ్‌ ఎప్పుడు రాబోతున్నారు' అని అడగ్గా.. "ఆయన షూటింగ్​లు జరుగుతున్నాయి కదా. హింట్​ కూడా ఇచ్చారు. కచ్చితంగా మా షోకి వస్తారు" అంటూ ఆలీ చెప్పారు. అయితే ఎప్పుడనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఇది పాత వీడియో అయి ఉండొచ్చని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. కాగా, పవన్​కల్యాణ్​-ఆలీ రిలేషన్‌ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్క్రీన్‌ మీద వాళ్లిద్దరి కామెడీ టైమింగ్, బాండింగ్‌ అంటే అందరికీ ఎంతో ఇష్టం. దాదాపుగా పవన్‌ చేసిన ఎన్నో సినిమాల్లో ఆలీకి ప్రత్యేకంగా ఓ పాత్ర ఉండేది.

ఇక తాజాగా ఆలీకి ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా నియమించింది. అటు రాజకీయంగా పవన్‌ కూడా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఆలీ షోకి పవన్‌ కల్యాణ్‌ నిజంగానే వస్తే.. ఆయన ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? అందుకు పవన్‌ ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి:బీచ్​లో రకుల్​ చిల్​ దివ్యభారతి అమీజాక్సన్​ కిరాక్​ పోజులు ​

ABOUT THE AUTHOR

...view details