pawan kalyan ustaad bhagat singh : వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ రసవత్తరంగా మారబోతుంది. సడెన్‌గా ఓ బడా స్టార్ హీరో సినిమా ఈ రేసులోకి దిగబోతుందని సమాచారం అందింది. అది మరెవరో కాదు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. అదేంటి.. ఈ చిత్రం ఆగిపోయింది కదా అంటారా? అదే ట్విస్ట్ ఇక్కడ. ఆ సినిమా మూవీటీమ్ తమ నిర్ణయంలో యూటర్న్ తీసుకున్నట్లు తెలిసింది.
వాస్తవానికి పవన్ రాజకీయ ప్రచార సభలతో బిజీ అవ్వడంతో.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ ఆగిపోయిందని, సినిమాను ఏపీ ఎలెక్షన్స్ తర్వాతకు పోస్ట్ పోన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు.. ఎన్నికల కన్నా ముందే ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. దర్శకుడు హరీశ్‌కు కూడా సినిమా పూర్తి చేస్తానని పవన్ మాటిచ్చారని అంతా అంటున్నారు.
రీసెంట్గా ఇద్దరు కలిసి చర్చలు జరిపారని తెలిసింది. అయితే పవన్ ఓ కండిషన్ పెట్టారట. 30 రోజుల్లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయాలని చెప్పారట. దీనికి హరీశ్ కూడా ఒప్పుకున్నారట. అలా ఇద్దరు కలిసి ఈ ఏడాదే సినిమా షూటింగ్‌ను ఎలాగైనా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని ఫిక్స్ చేశారట.