Pawan Kalyan Upcoming Projects :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత ఏడాదికి ఓ సినిమాతో అటు అభిమానులను, ఇటు సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. 2021లో 'వకీల్ సాబ్'తో అభిమానులను పలకరించిన పవన్.. గత ఏడాది 'భీమ్లా నాయక్' అంటూ సౌండ్ మోగించారు. ఇక ఈ ఏడాది 'బ్రో'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. అయితే ఈ మూడు చిత్రాలు రీమేక్ కావడం వల్ల.. అభిమానులు కాస్త నిరాశ పడ్డారు.
అయితే ఇప్పుడు అభిమానులు.. పవన్ నుంచి స్ట్రెయిట్ సినిమాలు ఆశిస్తున్నారు. అలాగే పవర్ స్టార్ కూడా స్ట్రైయిట్ మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు.. మేకింగ్ దశలోనే ఉన్నాయి. ఈ మూడు సినిమాలపై మంచి హైప్ ఉన్నాయి. అలాగే ఈ చిత్రాల రిలీజ్ డేట్స్పై పలు రకాల ఊహాగానాలు వినిపించాయి. 'ఓజీ' ఈ డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రచారం సాగగా. ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి అంటూ వార్తలు వచ్చాయి. ఇక హరిహర వీరమల్లు కూడా ఏపీ ఎలక్షన్స్లోపే విడుదల చేస్తామని నిర్మాత ఎ.ఎం.రత్నం అన్నారు.