తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్​ 'ఓజీ' వీడియో అదుర్స్​.. పోర్ట్ ఫైట్​ హైలైట్! - pawan kalyan og special video

పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్,​ సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా సెట్స్​లోకి అడుగుపెట్టింది. ముంబయిలో తొలి షెడ్యూల్​ మొదలుబెట్టిన డైరెక్టర్​ ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్​ చేశారు. ఆ వీడియో చూస్తుంటే కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. అవేంటంటే..

pawan kalyan og special video
pawan kalyan og special video

By

Published : Apr 16, 2023, 9:56 AM IST

'హరిహర వీర మల్లు', 'ఉస్తాద్​ భగత్​ సింగ్'​, 'వినోదాయ సీతం' రీమేక్.. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ​'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ ఓజీ మూవీ శనివారం జరిగిన పూజా కార్యక్రమంతో పట్టాలెక్కింది. ముంబయిలో తొలి షెడ్యూల్​ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణ కోసం వారం తర్వాత పవన్​ ముంబయికి పయనమవ్వనున్నారని సమాచారం. షూటింగ్​ ప్రారంభమయ్యిందన్న విషయాన్ని తెలియజేస్తూ.. చిత్ర యూనిట్​ ఓ వీడియోను విడుదల చేసింది. రిలీజైన నిమిషాల్లోనే కొన్ని లక్షల వ్యూస్ అందుకున్న ఆ వీడియో చూస్తే.. అందులో కొన్ని ఆసక్తికర అంశాలు బయటపడతాయి. అవేంటంటే..

క్లైమాక్స్​ నంబర్​ -16
వీడియో మొదట్లో ఓ నలిపేసిన పేపర్​ నేలపై పడుతుంది. అందులో క్లైమాక్స్​ 14 అని ఉంది. ఆ తర్వాత చూస్తే డస్ట్​ బిన్ మొత్తం అలాంటి పేపర్స్​ కనిపిస్తాయి. ఇక తీక్షణంగా ఏదో రాస్తూ కనిపించిన దర్శకుడు చివరకు క్లైమాక్స్ నంబర్ 16ను ఫైనలైజ్​ చేస్తారు.​ దీని బట్టి ఆయన ఈ సినిమా కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు తెలుస్తోంది. అలా 15 క్లైమాక్స్​లను రిజెక్ట్​ చేసి చివరిది ఓకే చేశారన్న మాట.

పోర్టులో పోరు
వీడియోలో ఓ స్క్రిప్ట్​ పేపర్ కనిపిస్తుంది. అందులోని ఓ సీన్​ను ఇలా వివరించారు డైరెక్టర్​.. డంగి, ఫైజల్ అనే ఇద్దరు గూండాలు ముంబయి పోర్టుకు మార్గంలా ఉండే ఓ పెద్ద ఇనప గేట్​ ముందు వంద మందికిపై అనుచరులతో నిలబడుతారు. 'ఇంతమందిని దాటి ఇక్కడికి రావాలి అని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండదు' అని విలన్లలో ఒకరైన డంగి అంటాడు.

కట్​ చేస్తే.. బుల్లెట్ల శబ్దం వినిపించడం వల్ల డంగి, ఫైజల్.. ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ల ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఇక ఆ పొగలో నుంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశంలో నుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు ఆ వ్యక్తి. అతను ఇంకెవరో కాదు మన ఒరిజినల్ గ్యాంగ్​స్టర్ పవన్​ కల్యాణ్​. ఈ స్క్రిప్ట్ షీట్​ను చూస్తుంటే ముంబయి పోర్ట్ సీన్​లోనే హీరో సినిమాల్లో గ్రాండ్​ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సీన్స్​ కావలనుకునే పవర్​ స్టార్​ ఫ్యాన్స్​.. ఈ ఒక్క హింట్​తో సీన్​ మొత్తం ఎలా ఉంటుందో ఊహించుకుని ఆనందపడుతున్నారు. ఇక వీడియోలో వచ్చిన బ్యాక్​గ్రౌండ్​ స్కోర్​ సైతం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు తమన్​ సంగీతాన్ని అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details