Pawan Kalyan OG Budget : ప్రస్తుతం ఎక్కడ చూసిన పాన్ ఇండియా మేనియా నడుస్తోంది. ఏ దర్శకుడిని కదిపినా ఇటువంటి కంటెంట్ దర్శనమిస్తోంది. దర్శక నిర్మాతలే కాదు హీరో హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలంటేనే భారీ బడ్జెట్‌తో రూపొందాల్సిందే. ఎందుకంటే అన్ని భాషల్లో తెరకెక్కాలంటే దానికి తగ్గట్టుగా అన్నింటిని సమకూర్చుకోవాల్సిందే. తారల రెమ్యునరేషన్ నుంచి సెట్లు వేయడం వరకు అన్నీ కూడా వ్యయంతో కూడిన పనే. అందులోనూ గ్యాంగ్‌స్టర్ డ్రామా, యాక్షన్ సినిమాలు అంటే వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంటాయి. తాజాగా రిలీజ్‌కు సిద్ధమౌతున్న పవర్ స్టార్ పవన్ -సుజీత్ మూవీ ఈ కోవకు చెందిందే.
'ఓజీ' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఎక్కడ చూసిన చర్చలు జరుగుతోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ ఫొటోలుతో పాటు, మోషన్ పోస్టర్, స్పెషల్ వీడియో ఇలా ఓజీకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చిన అది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి చరిత్రలు సృష్టిస్తోంది. మరోవైపు ఓజీలోని ఇతర తారాగణం పలు మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో మూవీ ఎలా ఉండనుందో అన్న విషయాలను టూకీగా చెప్పుకొస్తున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి స్టార్స్.. ఓజీ గురించి చెప్పిన మాటలతో ఈ సినిమా గురించి అభిమానుల్లో భారీ అంచనాలే పెరిగిపోయాయి.