తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pawan Kalyan Shoes Cost : పవన్ కల్యాణ్ 'బ్రో' షూస్​ అంతా కాస్ట్లీనా! - Pawan Kalyann Balmain Shoe Cost

Pawan Kalyan Shoes Cost : ఇటీవలే విడుదలైన 'బ్రో' సినిమా పోస్టర్​లో పవన్​ కల్యాణ్​ వేసుకున్న షూస్​పై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ షూ ధర తెలుసుకుని నెటిజన్లు షాక్​కు గురవుతున్నారు. ఇంతకీ దాని ధర ఎంతంటే..

Pawan Kalyann Shoe Cost
Pawan Kalyann Shoe Cost

By

Published : May 30, 2023, 11:39 AM IST

Pawan Kalyan Shoes : పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్​ చేస్తున్న ఆయన ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాల్లో గానీ రాజకీయాల్లో గానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏం చేసినా సెన్సేషన్​గానే నిలుస్తోంది. ఎలాంటి లుక్​లో మెరిసినా.. ఎలాంటి దుస్తుల్లో కనిపించినా అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పవన్​ వేసుకున్న ఓ షూస్​ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోెంది. ఆ షూ ధర తెలుసుకున్న అభిమానులు నోరెల్లబెడుతున్నారు.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న 'బ్రో' సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ఫొటో షూట్ చేసింది మూవీ టీమ్. ఇందులో భాగంగా ఓ పోస్టర్​ను తాజాగా రిలీజ్​ చేసింది. అందులో మామా అల్లుళ్లు పవన్, సాయి ధరమ్​ తేజ్​ అదిరిపోయే లుక్​లో కనిపించారు. ఓ వైపు బైక్‌పై కాలుపెట్టి పవన్‌ స్టైలిష్​ లుక్ ఇవ్వగా.. వెనకాల సాయితేజ్ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. అయితే ఇందలో పవన్ వేసుకున్న షూస్​ ట్రెండీగా ఉండటం వల్ల అభిమానులు దాన్ని గురించి గూగుల్​లో తెగ వెతికేసి.. బ్రాండ్​, ధర ఇలా అన్నీ విషయాలను తెలుసుకున్నారు.

Pawan Kalyann Shoe Cost : వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబోలో అట్రాక్టివ్​గా ఉన్న ఈ షూస్​ బాల్మైన్ (Balmain) అనే ఇంటర్నేషనల్ కంపెనీకి చెందినవి. దీని ధర అక్షరాలా.. రూ. 1,06,070 (లక్షా ఆరువేల డెబ్భై రూపాయలు) ఇక ఈ ధర తెలుసుకున్న ఫ్యాన్స్​ షాక్​కు గురయ్యారు. సోషల్​ మీడియాలో ఈ షూస్​ను తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Bro Movie Cast : ఇక 'బ్రో' సినిమా విషయానికి వస్తే.. యాక్టర్​ కమ్​ డైరెక్టర్​ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ రీమేక్​ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్​ను అందిస్తున్నారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్​ తేజ్​ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో.. ​ ప్రియా ప్రకాశ్​ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. జీ స్టూడియోస్​తో పాటు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై వివేక్ కూచిబోట్ల, టీజీ విశ్వప్రసాద్ కలిసి సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనికెళ్ల భరణి, బ్రహ్మానందం లాంటి స్టార్స్​ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రం. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details