తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెమ్యునరేషన్​పై ఓపెన్ అయిన పవన్ కల్యాణ్​​.. రోజుకు ఎన్ని కోట్లంటే? - పవన్​ కల్యాణ్ రెమ్యునరేషన్​ ఒక్క రోజుకు 2 కోట్లు

తాను రోజుకు ఎంత రెమ్యునరేషన్​ తీసుకుంటానో చెప్పేశారు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​. ఆ వివరాలు..

Pawan Kalyan remuneration
రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటారో చెప్పేసిన పవన్​

By

Published : Mar 15, 2023, 9:24 AM IST

Updated : Mar 15, 2023, 10:22 AM IST

సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకునేందుకు దాదాపు సినీ అభిమానులందరికీ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా వారి రెమ్యునరేషన్​ గురించి మరింత ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు. వాటికి సంబంధించి వివరాలను ఆరా తీస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఆయా హీరోల రెమ్యూనరేషన్​పై ఎన్నో రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ వాటిపై ఏ హీరోలు స్పందించరు. తమ పారితోషికం ఎంతో.. ఓపెన్​గా చెప్పరు. అయితే ఓ స్టార్​ హీరో మాత్రం ధైర్యంగా తన రెమ్యునరేషన్​ గురించి ఓపెన్​గా చెప్పేశారు. రోజుకు తాను ఎంత తీసుకుంటారో బహిరంగంగా తెలిపారు. ఆయనే పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​.​

ప్రస్తుతం రోజుకు తాను రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు స్పష్టతనిచ్చారు. ఇటీవలే ఓ సినిమాకు 22 రోజులు డేట్స్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అలా తాను ఒక్క సినిమాకు రూ. 44 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఓపెన్ అయ్యారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో.. తనపై రాజకీయంగా విమర్శలు చేసేవారికి సమాధానం చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అమ్ముడు పోయానని చేస్తున్న విమర్శలకు.. బదులుగా తన రెమ్యునరేషన్ రోజుకు రూ. 2 కోట్లు అని చెప్పారు. తాను డబ్బు కోసం ఆశపడే వాడిని కాదని.. కావాలంటే తానే డబ్బులు ఇస్తానని పేర్కొన్నారు.

కాగా, పవన్​ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు మరోవైపు పాలిటిక్స్​తో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. రెండింటిని బ్యాలన్స్ చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం తమిళ హిట్​ సినిమా 'వినోదయ సితం' రీమేక్​లో నటిస్తున్నారు. ఇందులో ఆయన మేనల్లుడు మెగా సుప్రీమ్​ సాయితేజ్​ కూడా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని ఈ చిత్రాన్ని డెరెక్ట్​ చేస్తున్నారు. ఈ సినిమాకే ఆయన 20రోజుల డేట్స్​ కేటాయించారని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు తాజా వ్యాఖ్యలతో.. ఈ సినిమాకే ఆయన రూ.44 కోట్లు తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో పాటు హరీశ్​ శంకర్ డైరెక్షన్​లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేయబోతున్నారు. చాలా కాలంగా పెండింగ్​ ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్​పైకి వెళ్లే అవకాశముంది. అలాగే ఆయన క్రిష్ దర్శకత్వంలో నటించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్​ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఇది పాన్​ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇక సాహో దర్శకడు సుజిత్​తోనూ ఓజీ అనే చిత్రాన్ని చేస్తున్నారు పవన్​.

ఇదీ చూడండి:టైగర్​ బ్యాక్​ టు హోమ్​.. ఆస్కార్​ ఆనందాన్ని తారక్ మొదటగా​ ఆమెతోనే పంచుకున్నారట!

Last Updated : Mar 15, 2023, 10:22 AM IST

ABOUT THE AUTHOR

...view details