తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Pawan Kalyan OG Glimpse : 'ఓజీ' గ్లింప్స్​.. ఈ అంశాలు గమనించారా​ ? సుజిత్​ 'సాహో'కు లింక్ పెట్టేశారుగా..

Pawan Kalyan OG Glimpse : పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ నటించిన లేటెస్ట్​ మూవీ 'ఓజీ'. గ్యాంగ్​స్టర్​ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్​ విడుదలైంది. ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రేక్షకులను గూస్​బంప్స్​ తెప్పించేలా ఉన్న ఆ టీజర్​లో కొన్ని ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటంటే ?

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Sep 3, 2023, 11:01 AM IST

Updated : Sep 3, 2023, 11:43 AM IST

Pawan Kalyan OG Glimpse : పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్​ మూవీ 'ఓజీ'. శనివారం పవన్​ బర్త్​డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ సాలిడ్​ గ్లింప్స్​ను మూవీ టీమ్​ రిలీజ్​ చేసింది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్​ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అందులో ఫుల్​ ఆన్​ యాక్షన్​ మోడ్​లో కనిపించిన పవన్​.. తన స్టైలిష్ లుక్స్​తో పాటు యాక్షన్ సీన్స్​తో ప్రేక్షకులను గూస్​బంప్స్​ తెప్పించారు. అసలు ఊహించని రీతిలో ఉన్న ఆ టీజర్​ ఇప్పుడు మిలియన్లకు పైగా వ్యూవ్స్​తో నెట్టింట ట్రెండ్​ అవుతోంది. ఇక పవన్​ హార్డ్​ కోర్​ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోను లూప్​లో పెట్టుకుని మరీ చూస్తున్నారట.

గత కొన్నేళ్లుగా పవన్ నటిస్తున్న సినిమాలు ఆయన స్టామినాతో సరిపోలడం లేదంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ టీజర్​ ఫ్యాన్స్​లో ఉత్సాహం నింపింది. 'తమ్ముడు', 'ఖుషి' 'బద్రి' లాంటి సినిమాల్లో లాగా ఈ ఓజీ కూడా పవన్​లోని పవర్​ను మరోసారి తెరపైకి తీసుకొచ్చిందంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇండస్ట్రీకి సాలిడ్​ హిట్స్ తెచ్చిపెట్టిన ఆ సినిమాల తర్వాత తర్వాత దర్శకులు ఎవరూ పవన్​ ఇమేజ్‌కి సరిపోయే చిత్రాన్ని తీయలేకపోయారు.

OG Teaser Details :'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' తప్ప పవన్ ఇమేజ్‌ని మరే సినిమా బ్యాలెన్స్ చేయలేదనేది వాస్తవం. ఇక పవన్ కూడా 'అజ్ఞాతవాసి' తర్వాత కొంతకాలం సినిమాలకు బ్రేక్​ ఇచ్చారు. అయితే కమ్​బ్యాక్​లో పవన్.. బ్యాక్ టు బ్యాక్ రీమేక్​లు చేయడం పట్ల ఆయన అభిమానులను ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఓజీ రాకతో ఊరట చెందిన ఫ్యాన్స్​.. సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందో అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే లేటెస్ట్​ టీజర్​ను డీకోడ్​ చేస్తే అందులోని ఇంట్రెస్టింగ్​ విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే..

  1. 'ఓజీ' కంటే ముందు సుజిత్ దర్శకత్వం వహించిన సినిమా 'సాహో'. 'వాజీ' అనే ఓ కల్పిత పట్టణంలో ఆ కథ జరిగినట్లు చూపించారు. అయితే ఇప్పుడు ఓజీలో వీడియోలో 'వాజీ ఇంపోర్ట్స్ & ఎక్స్పోర్ట్స్' అనే ఓ బోర్డు చూపించారు. దాని ముందు ఫైట్ జరిగినట్లు హింట్ ఇచ్చారు. దీంతో ఆ వాజీ సిటీకి, ముంబైలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌కు సంబంధం ఉంటూ ఫ్యాన్స్​ అంచనా వేస్తున్నారు. అంటే ఇది సుజిత్ కూడా 'ఓజీ'తో సినిమాటిక్ యూనివర్స్​ను క్రియేట్​ చేస్తున్నారంటూ ట్రెండ్​ క్రియేట్​ చేస్తున్నారు.
  2. ఇక టీజర్​ చివరిలో పవన్​ మరాఠీలో మాట్లాడతారు. అందులో 'లావ్​కర్​' అంటే... 'త్వరగా' అని అర్థం. ' ఖడే ఖడే కాయి బాగ్​తోస్​ జాకర్​ దూండ్​. అంటే... నిలబడి ఏం చూస్తున్నావ్ ! వెళ్లి త్వరగా వెతుకు' అని అర్థమట. అంతే కాకుండా పవన్ బ్రాస్‌లెట్‌పై ఉన్న జపనీస్ పదాలకు ' డ్రాగన్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు' అని అర్థమట.
  3. సాధారణంగా పవన్​ సినిమాల్లో సోషల్​ మెసేజ్​ ఇచ్చే పాట ఒకటి కచ్చితంగా ఉంటుంది. అయితే 'ఓజీ'లో కూడా అలాంటి పాట ఉండొచ్చు అంటూ ఓ హింట్​ ఇచ్చారు. ఇందులో కొంత మంది రోడ్ల మీద ఆందోళన చేసే దృశ్యాలు, వాళ్ళను పోలీసులు కొట్టడం వంటివి ఉన్నాయి. దీన్ని చూస్తుంటే ఆ సాంగ్ అప్పుడే రానున్నట్లు అనిపిస్తోంది.

OG Glimpse : చిరుతలా వేటాడుతూ పవన్ ఊచకోత.. 'ఓజీ' హంగ్రీ చీతా గ్లింప్స్ గూస్​బంప్సే

OG Glimpse : OG గ్లింప్స్ డీటైల్స్​ లీక్.. తెలుగులోనే తొలిసారి అలా.. ఇది తెలిస్తే గూస్​బంప్సే!

Last Updated : Sep 3, 2023, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details