తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్​ విన్యాసం.. మీరా చోప్రాకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ చురకలు - హరిహర వీరమల్లు

పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. తాజాగా చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. పవన్‌ కల్యాణ్‌ చేసిన విన్యాసాలు, ఆయన లుక్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. తాజాగా మీరా చోప్రా పెట్టిన ఒక పోస్ట్‌ జూనియర్​ ఎన్టీఆర్​ ఫ్యాన్స్​కు ఆగ్రహం తెప్పించింది.

kalyan
పవన్​ కల్యాణ్​ విన్యాసం

By

Published : Apr 9, 2022, 10:48 PM IST

Updated : Apr 9, 2022, 11:13 PM IST

క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో చిత్రీకరణ జరుపుకుంటోంది. కళా దర్శకుడు తోట తరణి వేసిన సెట్ లో దర్శకుడు క్రిష్ పవన్ కల్యాణ్ పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ టోడర్ లాజరోవ్ పర్యవేక్షణలో పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. సెట్ లో తన బల్లెంతో శత్రువులపై పోరాటం చేస్తున్న దృశ్యాలతో 25 సెకన్లతో కూడిన వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

ఎన్టీఆర్‌ అభిమానులు ఫైర్​: బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ మీరా చోప్రా. ఎక్కువగా మాత్రం యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్‌ను కించపరిచేలా పెట్టిన ట్వీట్లతో ఆమె మరింత పాపులర్‌ అయింది. రెండేళ్ల క్రితం తారక్‌ను ఉద్దేశిస్తూ పెట్టిన మీరా చోప్రా ట్వీట్లు తెగ వైరల్‌ అయ్యాయి. ఆ ట్వీట్లు చూసిన ఎన్టీఆర్‌ అభిమానులు మీరాపై ఆగ్రహంతో ఊగిపోయారు. తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఒక పోస్ట్‌ మళ్లీ తారక్‌ ఫ్యాన్స్‌ మండిపోయేలా చేసింది.

'సౌత్ ఇండియన్ యాక్టర్స్‌ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వారి టాలెంట్‌, వినయం, ప్యాషన్‌ను చూసి ఒకరు కచ్చితంగా నేర్చుకోవాలి.' అంటూ ప్రభాస్‌, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ పేర్లకు హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చింది. ఈ పోస్టులో కావాలనే ఎన్టీఆర్‌ను మెన్షన్‌ చేయలేదని తారక్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీపికా పదుకొణె, అలియా భట్‌ వంటి స్టార్‌ హీరోయిన్లే జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించేందుకు ఇష్టపడుతున్నారని, అవుట్‌ డేటెడ్, జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనికిరాని వారి మాటలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తారక్ ఫ్యాన్స్‌ కౌంటర్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఒక సమయంలో ఎన్టీఆర్‌కు జోడీగా మీరా చోప్రాకు నటించే అవకాశం వచ్చి చేజారిపోయింది. ఈ అక్కసుతోనే తారక్‌ను మీరా చోప్రా టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెడుతుందని సమాచారం.

ఇదీ చూడండి: బాహుబలి గిమ్మిక్కు అన్ని సినిమాలకు వర్క్​అవుట్​ అవుతుందా?

Last Updated : Apr 9, 2022, 11:13 PM IST

ABOUT THE AUTHOR

...view details