Kushi Movie Re Release Date : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం 'ఖుషి'. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ చిత్రంతో పవన్‌కల్యాణ్‌కు ప్రధానంగా యువత మరింత దగ్గరయ్యారు. 2001లో విడుదలైన ఈ చిత్రాన్ని శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మించారు. ఎస్‌జే సూర్య దర్శకత్వం వహించారు. పవన్ సరసన భూమిక నటించింది. ప్రేమకథ నేపథ్యంగా హృద్యంగా మలిచిన ఈ చిత్రంపై ముఖ్యంగా యూత్‌లో ఇప్పటికీ ఏ మాత్రం మోజు తగ్గలేదు. దీంతో డిసెంబర్ 31న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. మళ్లీ థియేటర్లలో 'ఖుషి' సందడి.. ట్రైలర్ రిలీజ్ - ఖుషి సినిమా రీ రిలీజ్ డేట్
Kushi Movie Re Release Date : పవర్‌స్టార్ అభిమానులకు ఇక పండగే. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఖుషి' ఈ డిసెంబర్ 31న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది.
గత కొన్నిరోజులుగా తమ అభిమాన హీరోల పాత చిత్రాలను విడుదల చేయాలని డిమాండ్ వస్తోంది. దీంతో నిర్మాతలు ఆ చిత్రాలను అప్‌డేట్ చేసి మళ్లీ థియేటర్లలో విడుదల చేయడం ట్రెండ్‌గా మారింది. ఇలా విడుదల చేసిన చిత్రాలకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో చిత్ర బృందాలు ప్రత్యేక రోజులను పురస్కరించుకొని సూపర్‌హిట్ చిత్రాలను మళ్లీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఖుషి' చిత్రానికి సాంకేతికంగా మరిన్ని హంగులు జోడించి విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. 4కే రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో థియేటర్లలో 'ఖుషి' సినిమాను విడుదల చేస్తున్నారు. ట్రైలర్ విడుదలతో పవన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో మళ్లీ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.