Pavan Kalyan Karate: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ డ్రామా మూవీ వచ్చే ఏడాది మార్చిలో థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేయగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తున్నారు.
'హరి హర వీరమల్లు' కోసం పవన్ ఫుల్ హార్డ్ వర్క్.. మాస్టర్ దగ్గర కరాటే నేర్చుకుంటూ! - పవన్ కల్యాణ్ హరిహర వీర మల్లు షూటింగ్
'హరి హర వీరమల్లు' సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే ఈటెతో ఫైట్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసిన ఆయన.. ఇప్పుడు కరాటేలో మెలకువల్ని నేర్చుకుంటున్నారు. ఈ మేరకు మాస్టర్‌తో కలిసి ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
!['హరి హర వీరమల్లు' కోసం పవన్ ఫుల్ హార్డ్ వర్క్.. మాస్టర్ దగ్గర కరాటే నేర్చుకుంటూ! కరాటే మెలకువలు నేర్చుకుంటున్న పవన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17043625-thumbnail-3x2-eeee.jpg)
ఈ సినిమాలోని పవన్ కల్యాణ్‌కు సంబంధించి ఓ క్రేజీ ఫొటో నెట్టంట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ కరాటే డ్రెస్‌లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఓ మాస్టర్‌ను పెట్టుకుని మరీ కరాటేలో ఆయన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ఓ భారీ సెట్‌లో ఏకంగా 900 మంది ఆర్టిస్ట్‌లతో షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలక సన్నివేశం ఇదేనని చిత్ర యూనిట్ చెప్తోంది.
వాస్తవానికి పవన్‌కు కరాటేలో అనుభవం ఉంది. గతంలో కొన్ని సినిమాల్లో కూడా ఆ ప్రతిభను చూపించారు. కానీ.. ఈ మూవీ షూటింగ్ కోసం మరిన్ని మెలకువల్ని మాస్టర్ వద్ద నుంచి పవన్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. వీరమల్లు క్యారెక్టర్ కోసం ఇప్పటికే ఈటెతో ఫైట్ చేయడాన్ని ప్రాక్టీస్ చేసిన పవర్‌స్టార్ షూటింగ్‌లో అదరగొట్టేసినట్లు వార్త వినిపిస్తోంది. మరి ఈ కరాటే ఫైట్ సినిమాలో ఎలా ఉండబోతోందో? అని అభిమానుల్లో ఆసక్తి రెట్టింపవుతోంది.