Pawan Kalyan Instagram Followers : అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలతో పాటు మూవీ అప్డేట్స్ను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటారు. అభిమానులు కూడా వారి గురించి తెలుకుసునేందుకు సోషల్ మీడియాలో తెగ ఫాలో అయిపోతుంటారు. ఇక ఇప్పటికే పలువురు స్టార్స్ ఒక్కొక్కరిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్కూడా ఇన్స్ట్రాలోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించారు. మంగళవారం ఉదయం ఆయన ఓ అకౌంట్ క్రియేట్ చేయగా.. కొన్ని నిమిషాల్లోనే ఆ వెరిఫైడ్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో పెరిగింది. ఇక ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన వన్ మిలియన్ మార్క్‌ను దాటేసి రికార్డు సృష్టించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు షురూ చేశారు. #PawanKalyanOnInstagram అనే హ్యాష్‌టాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు.
విజయ్‌కు గంటలో 1 మిలియన్ ఫాలోవర్స్.. మరి పవన్‌కు ఎంతసేపు పట్టిందో తెలుసా? - పవన్ కల్యాణ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్
సినిమా స్టార్స్ ఒక్కొక్కరిగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టి ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇన్స్ట్రాలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని గంటల్లోనే ఆయన వన్ మిలియన్ మార్క్‌ను దాటేసి రికార్డు సృష్టించారు. అయితే ఈ లిస్ట్‌లో తళపతి విజయ్ కూడా ఉన్నారు. అయితే ఆయన ఎంత సేపట్లో వన్ మిలియన్ మార్క్ దాటారంటే ?

Fastest Instagram accounts to reach 1 Million : మరోవైపు అకౌంట్ క్రియెట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇలా మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ను దాటిన స్టార్స్ లిస్ట్‌లోకి ఇప్పుడు పవన్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఈ జాబితో ఇప్పటి వరకు ఓ స్టార్ హీరో ట్రెండ్ అయ్యారు. ఆయనే తమిళ నటుడు దళపతి విజయ్. ఈయన ఏప్రిల్ 2న ఇన్‌స్టా అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఓ పోస్ట్ షేర్ చేశారు. ఇక విజయ్ ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో అప్పుడే ఆయన ఖాతాకు మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు. సుమారు 99 నిమిషాల్లోనే 1.1 మిలియన్ మంది విజయ్ను ఫాలో అయిపోయారు. ప్రస్తుతం ఆయన రికార్డుతో ఇండియాలో ఫాస్టెస్ట్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌ను అందుకున్న స్టార్స్‌లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత పవర్ స్టార్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే వరల్డ్ వైడ్‌గా మాత్రం ఈ రికార్డును సౌత్ కొరియా సింగర్ కిమ్ తేహ్యుంగ్ అందుకుని రికార్డుకెక్కారు. ఆయన అకౌంట్ క్రియేట్ చేసుకున్న 43 నిమిషాల్లోనే మిలియన్ ఫాలోవర్స్‌ను అందుకున్నారు.