తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

భవదీయుడు భగత్​ సింగ్​పై డైరెక్టర్ అదిరే అప్డేట్, ట్విట్టర్​లో పవన్ రికార్డు - pawan kalyan twitter followers

Pawan Kalyan Harish Shankar Movie పవన్​ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో రానున్న భవదీయుడు భగత్ ​సింగ్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై హరీశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్​ను స్టైల్​గా చూపిస్తానని తెలిపాడు. మరోవైపు ట్విట్టర్​లో పవన్​ కల్యాణ్ ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్లు దాటింది.

harish shankar pawan movie
పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ మూవీ

By

Published : Aug 27, 2022, 8:03 PM IST

Pawan Kalyan Harish Shankar Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కలయికలో వచ్చే సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్​లో వచ్చిన గబ్బర్ సింగ్ తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీసు రికార్డులను బద్దలుగొట్టింది. వీరిద్దరి కాంబోలో 'భవదీయుడు భగత్ సింగ్' తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు తెప్పించే విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు హరీశ్ శంకర్.

పవర్ స్టార్ అభిమానుల ట్వీట్లకు అప్పుడప్పుడు హరీష్ రిప్లై ఇస్తుంటాడు. 'ఆ స్టైలు, స్వాగ్, స్టెప్స్ ఏమైపోయాయ్ కల్యాణ్ అన్నా. హరీష్ శంకర్ అన్నా మళ్లీ నీ వల్లే అవుతుంది ఇవన్నీ.. నీ సినిమాతోనే లాస్ట్ అనిపిస్తుంది' అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ వేశాడు. దీనిపై హరీశ్ స్పందించాడు. 'అన్నీ ఉంటాయ్.. ఏదీ మిస్ అవ్వదు.. మీ ఎదురుచూపులకు తగ్గ ప్రతిఫలం వస్తుంది.. నన్ను నమ్మండి' అంటూ రిప్లై ఇవ్వడంతో పవర్ స్టార్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

.

Pawan Kalyan Twitter Followers:
మరోవైపు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్​లో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్ అకౌంట్‌లో 5 మిలియన్ల (50 లక్షల మంది) ఫాలోవర్ల మార్క్‌ను అందుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇటీవల పవన్.. ట్విట్టర్​లో ఎక్కువగా రాజకీయాలకు సంబంధించిన ట్వీట్స్ చేస్తున్నారు. అత్యంత అరుదుగా సినిమాలకు సంబంధించిన విషయాలను పంచుకుంటున్నారు.

ఇవీ చదవండి:అనుదీప్​తో వెంకీ కొత్త చిత్రం, కలెక్షన్లలో దూసుకెళ్తున్న సీతారామం

బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ABOUT THE AUTHOR

...view details