పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్.. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. పవన్, రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో స్కూల్‌లో జరిగిన వేడుకలకు రేణు దేశాయ్ తన కూతురు ఆద్యతో కలిసి రాగా.. పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
కొడుకు అకీరా కోసం కలిసిన పవన్‌కల్యాణ్-రేణుదేశాయ్! - renu desai instagram
పవన్‌కల్యాణ్.. తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో కలిసి దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫొటో ఎక్కడ దిగారు? ఎందుకు దిగారో తెలుసుకోవాలంటే.. ఇది చదివేయండి.
అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేపథ్యంలో పవన్, రేణు దేశాయ్, కూతురుతో కలిసి ఫొటో దిగారు. ఆ ఫొటోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే అది వైరల్‌గా మారిపోయింది. పవన్ కల్యాణ్, రేణుదేశాయ్ ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. 2009లో పవన్, రేణు పెళ్లి చేసుకున్నారు. అయితే వివాహం చేసుకున్న మూడేళ్లకే ఈ జంట విడిపోయింది. 2012లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
ఇదీ చదవండి:'సలార్' షూటింగ్లో ప్రభాస్ పిక్స్ లీక్.. కంగారులో యూనిట్!