Pawan Kalyan Hari Hara Veeramallu: 'భీమ్లానాయక్' విజయంతో జోరుమీదున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్. ఆయన కీలక పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరి హర వీరమల్లు'. నిధి అగర్వాల్ కథానాయిక. ఇప్పటికే 50శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగారు పవన్. ఇటీవల మొదలైన తాజా షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.
Pavan Kalyan Getup: ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ 'హరి హర వీరమల్లు' పాత్రదే స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రలను దృష్టిలో పెట్టుకుని 30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. మరి పవన్‌కల్యాణ్ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం పవన్ మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇక తెరపై 'వీరమల్లు'గా పవన్ విజృంభణ చూసేందుకు అభిమానులు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు.