Bro movie Day 2 Collections : పవర్ స్టార్ పవన్ కల్యాణ్-సుప్రీం హీరో సాయి ధరమ్‌తేజ్ కలిసి నటించిన కొత్త చిత్రం 'బ్రో'. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం జులై 28న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినా మంచిగానే ఆడుతోంది. పవన్ వింటేజ్ టచ్, తేజ్ యాక్టింగ్ సినిమాకు ప్రత్యేకంగా నిలిచాయి. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడీ సినిమా కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం..
Bro Movie Box Office Collection : 3వ రోజు తెలుగు రాష్ట్రాల్లో.. 'బ్రో' సినిమాకు మూడో రోజు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. నైజాంలో రూ. 4.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.55 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.66 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 80 లక్షలు, పశ్చిన గోదావరిలో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 75 లక్షలు, కృష్ణాలో రూ. 78 లక్షలు, నెల్లూరులో రూ. 35 లక్షలు వచ్చాయి. మొత్తంగా రూ. 10.48 కోట్లు షేర్, రూ. 17.00 కోట్లు గ్రాస్ కలెక్ట్ అయింది.
3 రోజులు కలిపి తెలుగురాష్ట్రాల్లో.. మూడు రోజుల్లో నైజాంలో రూ. 17.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.56 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 5.74 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 3.93 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 3.74 కోట్లు, గుంటూరులో రూ. 4.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.75 కోట్లు, నెల్లూరులో రూ. 1.39 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ. 44.56 కోట్లు షేర్, రూ. 72.50 కోట్లు గ్రాస్ వచ్చిందట.
వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లను అందుకుంది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 5.85 కోట్లు వచ్చాయట. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 55.26 కోట్లు షేర్, రూ. 91.75 కోట్లు గ్రాస్ వచ్చిందని తెలిసింది.
ఇంక ఎంత రావాలంటే..? ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 97.50 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు అన్నాయి. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లు. ఇప్పటి వరకు మూడు రోజుల్లో రూ. 55.26 కోట్ల వసూళ్లు వచ్చాయి. అంటే మరో రూ. 43.24 కోట్లు వస్తే సినిమా క్లీన్ హిట్ అందుకున్నట్టు అవుతుంది.