సామాజిక మాద్యమాల్లో తమపై వస్తున్న విమర్శలకు సీనియర్ నటుడు నరేష్, పవిత్రలు ముగింపు పలికారు. త్వరలోనే తామిద్దరం పెళ్లిచేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు నటుడు నరేష్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ తమ ప్రపంచంలోకి ఆహ్వానిస్తూ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో పవిత్రతో కలిసి కేక్ కటిస్తూ చేస్తూ... త్వరలోనే పవిత్రను తాను పెళ్లిచేసుకోబోతున్నట్లు నరేష్ ప్రకటించాడు. కొన్ని రోజుల నుంచి వీరిద్దరు కలిసి ఉండటం చిత్ర పరిశ్రమలోనూ, సామాజిక మాద్యమాల్లోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నరేష మూడో భార్య రమ్య కూడా వీరి బంధంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి ముగింపు పలుకుతూ తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు పవిత్రనరేష్ యాష్ ట్యాగ్ పేరుతో వీడియో విడుదల చేయడం మరోసారి చర్చనీయాంశమైంది.
నటి పవిత్రతో పెళ్లి.. లిప్ కిస్తో కన్ఫామ్ చేసిన నరేశ్ - పవిత్ర లోకేష్ నరేశ్ రిలేషన్ షిప్
నటి పవిత్రతో పెళ్లి.. లిప్ కిస్తో కన్ఫామ్ చేసిన నరేశ్
11:45 December 31
Pavitra lokesh Naresh Marriage confirmed
Last Updated : Dec 31, 2022, 12:27 PM IST