వెండితెరపై ఆయన కనిపిస్తే ఈల వేసి గోల చేయాల్సిందే. సాధారణ కథానాయకుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మాస్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. అశేష తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. పవర్ స్టార్ అయ్యారు. ఒక్క హిట్టు కూడా లేకుండా సుమారు నాలుగేళ్లు స్టార్ ఇమేజ్ కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఆయన క్రియేట్ చేసిన రికార్డును మళ్లీ ఆయనే బద్దలుగొట్టారు.
దుమ్మురేపిన 'ఖుషి' వసూళ్లు.. రీరిలీజ్ల్లో పవన్ కల్యాణే టాప్! - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషి రీ రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషి' రీరిలీజ్ రికార్డులు బద్దలుగొడుతోంది. సినిమా వచ్చి దాదాపు 21 ఏళ్లైనా పవర్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 'ఖుషి' రీరిలీజ్ కలెక్షన్లు ఎంతంటే?
kushi re release record collections
ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో పవర్‌స్టార్ రికార్డులు సృష్టిస్తున్నారు. పవర్‌స్టార్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న 'జల్సా'ను రీరిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రూ.3.2 కోట్లు కలెక్ట్ చేసింది. డిసెంబరు 31న రీరిలీజైన.. 'ఖుషి' రూ.3.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి.. 'జల్సా' రికార్డును బద్దలుగొట్టింది. అంతకుముందు రీరిలీజ్ అయిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు 'పోకిరి' సినిమా రూ.1.75 కోట్ల వసూళ్లతో మూడో స్థానంలో ఉంది.