బాలీవుడ్ 'కింగ్‌కాంగ్' షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన చిత్రం పఠాన్. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వివాదాల నడుమ విడుదలైన 'పఠాన్' తొలి రోజు నుంచీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. వసూళ్లపరంగా బాలీవుడ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. ఈ చిత్రంలోని హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహంల యాక్షన్ స్టంట్స్, విజువల్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఈ సినిమా డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. సూపర్ రజినీకాంత్‌పై కీలక కామెంట్లు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఇండర్వ్యూలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సిద్ధార్థ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..
'రజనీకాంత్‌ని ఓడించాలంటే..' పఠాన్ డైరెక్టర్ అదిరిపోయే ఆన్సర్! - రజినీకాంత్‌పై సిద్ధార్థ్ ఆనంద్ కామెంట్లు
షారుక్ ఖాన్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'పఠాన్'. వివాదాల నడుమ విడుదలైనా ఈ సినిమా.. కలెక్షన్లలో దూసుకెళ్తోంది. కాగా, ఈ మూవీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు రజినీ ఫ్యాన్స్‌లో ఈ వ్యాఖ్యల గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇంతకీ సిద్ధార్థ్ ఆనంద్ ఏమన్నారంటే..
పఠాన్ సినిమాను నిర్మించన సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్. ఈ సంస్థకు బాలీవుడ్‌లో విశేష గుర్తింపు ఉంది. కాగా, ఈ ప్రొడక్షన్ కంపెనీ.. వైఆర్‌యఫ్ స్టూడియోస్, వైఆర్‌యఫ్ ఫిల్మ్స్, వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్ తదితర పేర్లతో ఒక్కో బ్యానర్‌పై ఒక్కో నేపథ్యమున్న కథలను తెరకెక్కిస్తోంది. అలా 'వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్'లో భాగంగానే 'పఠాన్' చిత్రన్ని రూపొందించారు. అయితే, "ఈ వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్ భాగంగా షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్లతో రూపొందించే సినిమాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ విలన్‌గా ఉంటే ఏమవుతుంది అని" విలేకరులు అడిగారు. దీనికి సిద్ధార్థ్ ఆనంద్ ఆదిరిపోయే సమాధానం ఇచ్చారు. " రజినీకాంత్‌పై వీరంతా ఎలా గెలుస్తారు?.. రజినీకాంత్‌పై గెలవాలంటే మరో రజినీకాంత్ కావాలి " సూపర్ రిప్లై ఇచ్చారు. దీంతో సిద్ధార్థ్ ఆనంద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు రజినీ అభిమానులు. సిద్ధార్థ్ ఆనంద్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. సిద్ధార్థ్.. రజినీకాంత్‌కు గాడ్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చారంటూ పొగుడుతున్నారు.
పాఠాన్ కలెక్షన్ల జోరు.. రూ. 400 కోట్లు!
బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 10వ రోజు వరకు మొత్తంగా రూ. 364 కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది. రూ. 400 కోట్ల మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఇక, ఇప్పటివరకు హిందీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా పఠాన్ నిలిచిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాగా, మొదటి రెండు స్థానాల్లో బాహుబలి (హిందీ), కేజీఎఫ్(హిందీ) ఉన్నాయని సమాచారం. కాగా, తమ 'వైఆర్‌యఫ్ స్పై యూనివర్స్'లో 'పఠాన్' చిత్రం వసూళ్ల పరంగా నంబరు 1గా నిలిచిందని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇదివరకే వెల్లడించింది.