బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో అలరిస్తున్నాడు. ఈయన సినిమాలకు భారత్‌లోనే కాకుండా ఓవర్సీస్లో ఫ్యాన్స్ ఉన్నారు. షారుక్ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతుందో అని వేయి కళ్లతో చూసే అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా రిలీజైన పఠాన్ సినిమాతో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వడమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మార్క్‌ను టచ్ చేసి మరింత విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ చూసిన పాకిస్థాన్ వాసులు ఆ సినిమాను అక్రమంగా చూస్తున్నారట. ఈ విషయం ఫేస్బుక్లో ఓ పోస్ట్ ద్వారా వ్యాపించగా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.
పాకిస్థాన్‌లో అక్రమంగా పఠాన్ స్క్రీనింగ్.. రూ.700కోట్ల కలెక్షన్స్!
బాలీవుడ్ బాద్షాకు ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. దీనికి నిదర్శనం పఠాన్ మూవీ కలెక్షన్స్. వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా బక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ సినిమా పాకిస్థాన్‌లో అయితే అక్రమంగా స్క్రీనింగ్ వేసి మరీ చూస్తున్నారట. బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతున్నారని తెలిసిందే. అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తున్నాయట.
ఆ పోస్ట్ ప్రకారం పఠాన్ స్క్రీనింగ్ పాకిస్థాన్ రాజధాని కరాచీలో జరిగిందని.. సినిమా టిక్కెట్టు కూడా రూ.900కు అమ్ముడుపోతుందట. ఈ సినిమాను డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో మరో సారి స్క్రీనింగ్ చేస్తున్నట్లు అంతే కాకుండా.. పఠాన్‌ను పాకిస్థాన్‌లో ప్రదర్శించే బాధ్యతను యూకేకు చెందిన ఫెయిర్‌వర్క్ ఈవెంట్స్ అనే సంస్థ తీసుకుందని తెలుస్తోంది. సామాజిక మాధ్యామల్లో ఈ వార్త హల్ చల్ అవుతుండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్‌లో ఇండియా సినిమాల స్క్రీనింగ్ నిలిపేశారని అయినా వీళ్లు ఇలా అక్రమంగా ఎలా చూస్తారంటూ మండి పడుతున్నారు. అయితే ఈ వార్తలను పాకిస్థాన్ ఖండించింది. 'మా దేశంలో భారతీయ చిత్రాలను నిషేధించినప్పుడు, పఠాన్‌ను మేమెందుకు ప్రదర్శిస్తాం" అని అంటోంది. ఇలా ఇరు దేశాల మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతుండగా.. ఆ పోస్ట్‌ను ఫేస్బుక్ నుంచి తొలగించారు.
700 కోట్ల మార్క్‌ను దాటిన పఠాన్..
జనవరి 25న రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుక్ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకు అనుగుణంగా సినిమా కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తాజాగా రూ.700 కోట్ల మార్కును అందుకుని మరింత దూసుకెళ్తోంది.