తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Yashoda: సామ్​ కాకుండా ఆ హీరోయిన్​ చేస్తే అంత బాగుండేదా?

స్టార్ హీరోయిన్​ సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్​ 'యశోద' చిత్రం కొద్ది రోజుల క్రితం విడుదలై సూపర్​ హిట్​ టాక్​ను దక్కించుకుంది. అయితే ఈ చిత్రంలో సామ్ కాకుండా ఆ స్టార్​ హీరోయిన్​ నటిస్తే ఇంకా బాగుండేదట. అప్పుడా చిత్రం మరింత బాగా ఆడేదట. ఆ సంగతులు..

Yashoda
Yashoda: సామ్​ కాకుండా ఆ హీరోయిన్​ చేస్తే అంత బాగుండేదా?

By

Published : Dec 31, 2022, 10:46 AM IST

స్టార్ హీరోయిన్​ సమంత నటించిన 'యశోద' చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్​ అందుకుంది. ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమాపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని తెలిపారు. యశోద చాలా మంచి సినిమా అన్నారు. హీరోయిన్‌ పాత్రలో సమంత చాలా బాగా చేసిందని.. ఆమె అద్భుతమైన నటి అని కొనియాడారు.

దర్శకులు హరి - హ‌రీష్‌లు సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరును ప్రశంసించారు. మొదటిలో అమాయకంగా ఉన్న అమ్మాయిగా చూపించి క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారని అన్నారు. విజయశాంతి ‘కర్తవ్యం’ తీసిన సమయంలో ఈ యశోద కథ ఆవిడ చేస్తే ఇంకా బాగుండేదేమో అని ఆయనకు అనిపించదన్నారు. ఎందుకంటే విజయశాంతి ఇలాంటి పాత్రలను అలవోకగా చేయగలదన్నారు. అందుకే ఈ కథ ఆమెకు బాగుండేదని తనకు అనిపించినట్లు తెలిపారు. ఇక యశోద సినిమా కథ వింటే ఎవరైనా చలించిపోతారన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం జరగడం ఇదంతా కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందని చెప్పారు.

సినిమాలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుందన్నారు. యశోద చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగమని చెప్పారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా చాలా బాగా పెట్టారని కొనియాడారు. యశోద, గౌతమ్‌, బలరాం, వాసుదేవ్‌ ఇలా భాగవత కథ గుర్తుకువచ్చేలా దర్శకులు ఈ సినిమాలోని పాత్రలకు పేర్లు పెట్టి.. సినిమా చూసే వాళ్ల ఆలోచనను భాగవతంలోకి తీసుకువెళ్లారన్నారు. సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉన్నాయని అన్ని అద్భుతంగా ఉన్నాయని వివరించారు. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్‌ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం నిజంగా సాహసమన్నారు. ‘యశోద’ మంచి సినిమా అని అందరూ చూడాల్సిన చిత్రమని అన్నారు. సినిమాలు తీయాలనుకునే వాళ్లు ఇలాంటి సినిమాలు చూస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయని చెప్పారు. యశోద లాంటి సినిమా చూసినప్పుడు ఇలాంటి కథలు రాయచ్చని, ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించవచ్చని.. ఇలా ఎన్నో నేర్చుకోవచ్చని సలహా ఇచ్చారు.

'నా కోసం ఈ సినిమాను ఒక్కసారి చూడండి' అని పరుచూరి కోరారు. సమంత అద్భుతంగా చేసింది. మురళీ శర్మ నెగటివ్‌ పాత్ర చేసినా ఎక్కడా దొరకకుండా చాలా బాగా నటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ను చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. రావు రమేశ్‌ది చిన్నపాత్ర అయినా చక్కగా నటించారన్నారు. సినిమాలో నటించిన వారందరూ వాళ్లపాత్రలకు ప్రాణం పోశారని పొగిడారు. మైండ్‌బ్లోయింగ్‌ ట్విస్ట్‌లతో, అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచించిన దర్శకులకు, మంచి సంగీతం అందించిన మణిశర్మకు, ముఖ్యంగా సమంతకు ఆయన అభినందనలు తెలియజేశారు.

ఇదీ చూడండి:ఫ్యాన్స్​కు నటి పూర్ణ సర్​ప్రైజ్​ తల్లి కాబోతున్నట్లు వీడియో షేర్​

ABOUT THE AUTHOR

...view details