తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

''సీతారామం' క్లైమాక్స్​లో ఆ మార్పు చేసి ఉంటే సినిమా వేరే లెవల్​' - paruchuri gopala krishna review on sita ramam

ఇటీవల విడుదలై రికార్డులు సృష్టించిన 'సీతారామం​' మూవీపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. అయితే క్లైమాక్స్​ ఓ మార్పు చేసి ఉంటే సినిమా వేరే లెవెల్​లో ఉండేదని ఆయన అన్నారు. ఆ మార్పు ఏంటంటే?

Paruchuri gopala krishna opinion on sita ramam
Paruchuri gopala krishna opinion on sita ramam

By

Published : Sep 10, 2022, 8:38 AM IST

Updated : Sep 10, 2022, 8:46 AM IST

Paruchuri gopala krishna on sita ramam: పరుచూరి పాఠాల ద్వారా తాజా సినిమాలపై తన అభిప్రాయం చెబుతున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఆయన 'సీతారామం'పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హృద్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ విజయం సాధించిన ఈ చిత్రం తనకూ నచ్చిందని ఆయన తెలిపారు. విభిన్న పార్శ్వాలను స్పృశించే ప్రేమ, ఆకట్టుకునే యుద్ధ నేపథ్యం, ప్రేక్షకుల మదిలో అలజడి రేపే విషాదాంతంలాంటి అంశాలు సినిమాను మరుపురాని చిత్రంగా నిలబెట్టాయన్నారు.

గతంలో ఇదే నేపథ్యంతో వచ్చిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుని, కమర్షియల్‌గానూ విజయం సాధించాయని పరుచూరి తెలిపారు. ముఖ్యంగా షారుఖ్‌ ఖాన్‌, ప్రీతీ జింటా, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించిన వీర్‌జారా చిత్రం కూడా ఇదే కథాంశం అని ఆయన గుర్తు చేశారు. కానీ సగటు ప్రేక్షకుడు ఆశించే సుఖాంతానికి తావివ్వకుండా, దర్శకుడు సినిమాని విషాదాంతంగా ముగించడంతో 'సీతారామం' భిన్నమైన ప్రేమకథ చిత్రంగా నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే క్లైమాక్స్‌లో వాళ్లిద్దరూ కలిసినట్లు సినిమాని మార్చి ఉంటే వేరే లెవెల్లో ఉండేదని, హీరో పాత్రను ప్రశ్నార్థకంగా ముగించేయడం ప్రేక్షకులను కంటతడి పెట్టించిందని ఆయన తెలిపారు.

ఏదేమైనా చక్కని ప్రేమకావ్యం తీయడంలో దర్శకుడు హను రాఘవపూడి కృతార్థుడయ్యాడని పరుచూరి ప్రశంసించారు. ఇంకా ఈ చిత్రంలో నటించిన దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్, రష్మిక తమ నటనతో సన్నివేశాలను రక్తి కట్టించారని ఆయన తెలిపారు. తక్కువ నిడివి ఉన్న పాత్రలకు సైతం పెద్ద నటులను తీసుకుని, ఏ మాత్రం రాజీపడకుండా ఉన్నత విలువలతో 'సీతారామం' ను నిర్మించిన అశ్వనీదత్‌, ఆయన కుమార్తెలను అభినందించాల్సిందేనని పరుచూరి అన్నారు.

ఇదీ చదవండి:తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. సీమంతం ఫొటోలు​ వైరల్

'త్వరలో తెలుగు సినిమాకు దర్శకత్వం వహిస్తా.. డబ్బు ఎలా సంపాదించాలో తెలిసింది!'

Last Updated : Sep 10, 2022, 8:46 AM IST

ABOUT THE AUTHOR

...view details