Parineeti Chopra Raghav Chadha Wedding : బీటౌన్ క్యూట్ కపుల్ పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్‌పుర్‌లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్ వేదికగా ఆదివారం ఈ జంట ఒక్కటవ్వనున్నారు. అంగరంగ వైభవంగా మొదలైన ఈ వివాహ వేడుకల కోసం శుక్రవారమే ఈ జంట ఉదయ్‌పుర్‌కు పయనమైంది. వీరి తర్వాత ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఇక శనివారమే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. హల్దీ, సంగీత్ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి.
పంజాబీ స్టైల్లో జరగనున్న ఈ వెడ్డింగ్‌కు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హాజరవ్వనున్నారు. 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్యాలెస్ నుంచి బారాత్ ప్రారంభవ్వనుంది. దీని కోసం రాఘవ్ ఓ బోట్లో ఎక్కి, ప్యాలెస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. పెళ్లిలో ఇది హైలైట్‌గా నిలవనుందని టాక్. ఆ తర్వాత 3:30 నుంచి ప్రారంభమవ్వమనున్న ఈ పెళ్లి వేడుక.. సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది.
Parineeti Raghav Wedding Dress : ఈ జంట పెళ్లి దుస్తులను ఇద్దరు డిజైనర్లు రెడీ చేశారట. రాఘవ్ చద్దా మామ, ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా, వరుడి కోసం అన్ని వివాహ దుస్తులను డిజైన్ చేయగా.. పెళ్లి కూతురు పరిణీతి మనీశ్ మల్హోత్రా రూపొందించిన దస్తులను ధరించనుంది. బేసిక్ సాలిడ్ పాస్టెల్ కలర్ లెహంగా, స్టేట్మెంట్ జ్యువెలరీ స్పెషల్ లుక్‌లో పరిణీతి ఎట్రాక్షన్‌గా కనిపించనున్నారని టాక్.