తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Parineeti Chopra Raghav Chadha Marriage : గెస్ట్​లుగా 4రాష్ట్రాల సీఎంలు.. రెండు రిసెప్షన్లు.. పరిణీతి- రాఘవ్​ పెళ్లి వేడుకల్లో అదే హైలైట్​! - పరిణీతి చోప్రా రాఘవ్​ చద్దా పెళ్లి వేదిక

Parineeti Chopra Raghav Chadha Marriage : బాలీవుడ్​ క్యూట్​ కపుల్​ పరిణీతి చోప్రా - రాఘవ్​ చద్దా.. మరో రెండు రోజుల్లో పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న లీలా ప్యాలెస్​ వేదికగా ఈ జంట ఒక్కటవ్వనుంది. ఈ క్రమంలో వీరి వివాహ వేడుకల్లో ప్రత్యేకతేలంటంటే?

Parineeti Chopra Raghav Chadha wedding
Parineeti Chopra Raghav Chadha wedding

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 12:49 PM IST

Parineeti Chopra Raghav Chadha Marriage :బాలీవుడ్​ క్యూట్​ కపుల్​ పరిణీతి చోప్రా - రాఘవ్​ చద్దా పెళ్లి పీటలెక్కనున్నారు. ఉదయ్​పుర్​లోని పిచోలా సరస్సు మధ్య ఉన్న అందమైన లీలా ప్యాలెస్​ ఈ వివాహానికి వేదిక కానుంది. సెప్టెంబర్​ 23న జరగనున్న ఈ పెళ్లికి అన్నీ సిద్ధం అవుతున్నాయి. వివాహ వేడుకల కోసం వధూవరులు రాఘవ్​, పరిణీతి ఉదయపుర్​కు పయనమయ్యారు. తాజాగా ఈ జంట దిల్లీ విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు. ఇక ఈ జంటతో పాటు వివాహానికి రానున్న అతిథులను ఆహ్వానించేందుకు ఉదయ్​పుర్​ ఎయిర్​పోర్ట్​ అందంగా ముస్తాబైంది.

రెండు రిసెప్షన్లు.. పెళ్లిలో అదే హైలైట్​..
Raghav Parineeti Wedding Venue : అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు ఇరు కుటుంబాల సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవ్వనున్నారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 23 ఉదయం 10 గంటలకు నుంచి ప్రారంభం కానున్న ఈ వివాహ వేడుకలు పంజాబీ స్టైల్​లో జరగనున్నాయి. 24వ తేదీ మధ్యాహ్నం తాజ్ లేక్ ప్యాలెస్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్యాలెస్ నుంచి బారాత్​ ప్రారంభవ్వనుంది. దీని కోసం రాఘవ్​ ఓ బోట్​లో ఎక్కి, ప్యాలెస్​లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వేడుకల్లో ఇది హైలైట్​గా నిలవనుందని టాక్​. ఆ తర్వాత 3:30 నుంచి ప్రారంభమవ్వమనున్న ఈ పెళ్లి వేడుక.. సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుంది. సెప్టెంబర్ 24న గ్రాండ్​ రిసెప్షన్ జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్​ 30న మరో రిసెప్షన్​ ఉండనుందట.

నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. నో ఫోన్​ పాలసీ..
Raghav Parineeti Wedding : మరోవైపు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వివాహ వేడుక జరగనుంది. నో ఫోన్​ పాలసీని కూడా అమలు చేయనున్నారట. ఇక పెళ్లికి హాజరు కానున్న అతిథుల జాబితాలో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారని సమాచారం. అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, అశోక్ గెహ్లోత్​, భూపేశ్ బఘేల్ హాజరుకానున్నారట. వీరితో పాటు 200 మందికి పైగా గెస్ట్​లు ఈ వేడుకకు రానున్నారు.

పాపులారిటీ కోసమే పెళ్లిళ్లు.. 'కశ్మీర్​ ఫైల్స్'​ డైరెక్టర్ కామెంట్స్.. ఆమెను ఉద్దేశించేనా?

గ్రాండ్​గా పరణీతి చోప్రా, రాఘవ్​ చద్ధా ఎంగేజ్​మెంట్​.. ఫొటోలు చూశారా!

ABOUT THE AUTHOR

...view details