తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బోయపాటితో ప్రభాస్​ సినిమా.. ఓకే అయితే మాస్​ జాతరే - ప్రభాస్ బోయపాటి సినిమా లేటెస్ట్ న్యూస్​

పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​.. దర్శకుడు బోయపాటితో ఓ సినిమా చేస్తారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Pan india star Prabhas Boyapati film
బోయపాటితో ప్రభాస్​ సినిమా.. ఓకే అయితే మాస్​ జాతరే

By

Published : Nov 5, 2022, 3:44 PM IST

సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఊహించని కాంబినేషన్స్​ జత కడతాయి. అవి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పుతాయి. ఇప్పుడు తాజాగా చిత్ర పరిశ్రమలో ఎవరూ ఎక్సపెక్ట్ చేయని ఓ కాంబినేషన్ ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. వీరి కాంబినేషన్​లో త్వరలోనే ఓ సినిమా ప్రకటించబోతున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయిపోయారు. ఇప్పటికే ఆదిపురుష్ రిలీజ్​కి రెడీ అవుతుండగా.. ప్రశాంత్ నీల్​తో సలార్, నాగ్ అశ్విన్​తో 'ప్రాజెక్ట్ కె' సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తర్వాత మారుతీతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఇంకో వషయమేమిటంటే.. బాలీవుడ్​ దర్శకుడు సిద్ధార్థ్​ ఆనంద్​తో ఓ సినిమా చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడా ప్రచారం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. ఇది కూడా త్వరలోనే అనౌన్స్​ చేయబోతున్నారట.

ఇక మాస్ డైరెక్టర్ బోయపాటి విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణతో 'అఖండ' సినిమా తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్​ అందుకున్నారు. ఇప్పుడు హీరో రామ్​తో ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఆ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే.. రామ్​తో సినిమా చేశాక.. ప్రభాస్ కోసం ఓ మాస్ సబ్జెక్టు రెడీ చేసే ప్లాన్​లో ఉన్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. వీరి కాంబినేషన్ మూవీని నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారని సమాచారం.

ఇదీ చూడండి:జబర్దస్త్​ కొత్త యాంకర్​ గురించి ఈ విషయాలు తెలుసా

ABOUT THE AUTHOR

...view details