తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మరింత మెరుగ్గా 'ఆదిపురుష్​' VFX.. రిలీజ్​ తేదీ ఇదే! - ఆదిపురుష్​ ప్రభాస్​

Adipurush Release Date : పాన్​ ఇండియా​ స్టార్​ ప్రభాస్​ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'​. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్​పై విమర్శలు వచ్చాయి. వాటిపై చిత్ర యూనిట్ దృష్టి సారించి మెరుగైన వీఎఫ్​ఎక్స్​ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఫిక్స్​ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడంటే..

prabhas adipurush delay
prabhas adipurush delay

By

Published : Dec 18, 2022, 9:20 PM IST

Adipurush Release Date : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ 'ఆదిపురుష్‌'. ఓంరౌత్‌ దర్శకుడు. 2023 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం మొదటి నుంచి భావించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 2023 జూన్​ 16న విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు.
ఇకపోతే ఇంతకుముందు విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన విమర్శలపై ఫోకస్‌ చేసిన చిత్రబృందం.. టెక్నికల్‌ అంశాలపై దృష్టి పెట్టిందని.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టి మరింత మెరుగ్గా వీఎఫ్‌ఎక్స్‌, సీజీ పనులు చేయిస్తోందని టాక్. దీని కారణంగానే జూన్​ సినిమా రిలీజ్​కు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్‌' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో, సీతగా కృతిసనన్‌ నటించారు. రామాయణంలో కీలకపాత్రగా భావించే రావణాసురుడిగా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. దసరా వేడుకల్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాము ఊహించిన స్థాయిలో టీజర్‌ లేదని, లంకేశ్వరుడు, హనుమంతుడు లుక్స్‌, వీఎఫ్‌ఎక్స్‌ అంతగా బాగోలేదని విమర్శించారు. దీంతో టీమ్‌.. ఇప్పుడు తప్పులను సరిచేసే పనిలో పడినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details