తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్'.. రెబల్​స్టార్​తో నటసింహం ఫుల్ ఫన్​! - అన్​స్టాపబుల్​ సీజన్​ 2 ఎపిసోడ్​ 6 గెస్టులు

సీజన్1 విజయం తర్వాత సీజన్​2 మరింత క్రేజీగా ఇండేలా ప్లాన్​ చేస్తోంది ఓటీటీ ప్లాట్​ఫాం ఆహా టీమ్. 'అన్​స్టాపబుల్' సీజన్​ 2కు పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ను​ గెస్టుగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్​ కానుకగా ఆ ఎపిసోడ్​ స్ట్రీమింగ్​ అయ్యే అవకాశాలున్నాయి.

Etv Bharatpan india star prabhas and actor gopichand unstoppable 2 show
pan india star prabhas and actor gopichand unstoppable 2 show

By

Published : Dec 2, 2022, 7:53 PM IST

Updated : Dec 2, 2022, 9:07 PM IST

డబుల్ ధమాకా.. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. డబుల్ గెస్టులు.. డబుల్ సందడి.. అన్నట్టు నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ సాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోకు వచ్చిన గెస్టులు ఓ లెక్క. ఇప్పుడు రాబోయే గెస్టులు మరో లెక్క. పాన్ ఇండియా లెవల్ హీరో వస్తున్నారు.

బాలయ్యతో ప్రభాస్, గోపీచంద్
'అన్‌స్టాపబుల్' సెకండ్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇద్దరు లేదా ముగ్గురు గెస్టులను తీసుకువస్తున్నారు. ఈసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మరో స్టార్ గోపీచంద్ వస్తున్నారట. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే.
సాధారణంగా ప్రభాస్, గోపీచంద్ కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. కానీ, బాలకృష్ణ కోసం వస్తున్నట్టు తెలిసింది. వాళ్లద్దరి స్నేహం గురించి బాలయ్య ఎన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పిస్తారో చూడాలి. ఈ నెల 11న ఆ ఎపిసోడ్ షూటింగ్ జరగనుందని తెలిసింది. వచ్చే గురువారం లేదంటే క్రిస్మస్ కానుకగా ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్​ అయ్యే ఛాన్స్ ఉంది.

ఐదో ఎపిసోడ్​.. ప్రత్యేకత అదే..
నాలుగో ఎపిసోడ్‌లో.. నిజాం కాలేజీలో తనతో పాటు చదువుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డిలతో పాటు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్‌లను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఐదో ఎపిసోడ్‌లో గెస్టులు నలుగురు వచ్చారు. ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, అల్లు అరవింద్​తో పాటు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, మరో దర్శకుడు కోదండరామి రెడ్డి అతిథులుగా వచ్చారు. తెలుగు సినిమా 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. తెలుగు చిత్రసీమలో దిగ్గజ దర్శక నిర్మాతలతో ఇన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడే అవకాశం ఉంది.

'అన్‌స్టాప‌బుల్‌' రికార్డ్స్..
'అన్‌స్టాప‌బుల్‌2' రికార్డులు క్రియేట్​ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అతిథులుగా వచ్చిన తొలి ఎపిసోడ్ పొలిటికల్​గా హీట్​ పెంచింది. అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కెఆర్ సురేష్ రెడ్డి వచ్చిన ఎపిసోడ్ కూడా.. ఆహాలో, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రాజకీయ నాయకులు, సీనియర్లు వచ్చినప్పుడు షోను ఓ విధంగా నడుపుతున్న బాలకృష్ణ.. యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్ వంటి వారు వచ్చినప్పుడు మరో విధంగా నడిపిస్తున్నారు. యువ హీరోలతో కలిసి సందడి చేస్తున్నారు.

Last Updated : Dec 2, 2022, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details