ప్రముఖ గాయని, పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సులోచన చావన్ మృతి చెందారు. 89 ఏళ్ల సులోచన వయోభారంతో శనివారం కన్నుమూశారు. వయస్సు రిత్యా సమస్యలతో గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆమె.. మహారాష్ట్రలోని తను ఇంట్లో చివరి శ్వాస విడిచారు.కాగా 1993 మార్చ్ 13 న ముంబాయిలో సులోచన జన్మించారు. శనివారం సాయంత్రం దక్షిణ ముంబయిలోని మెరైన్ లైన్స్ ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ సింగర్ కన్నుమూత - గాయని సులోచన చావన్ కన్నుమూశారు
పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, గాయని సులోచన చావన్(89) కన్నుమూశారు. వయస్సు రిత్యా గత కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్న ఆమె.. శనివారం తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ గాయని సులోచన చావన్ మృతి
రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో సులోచనను పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించారు. ఆమె అధ్భుతమైన గాత్రంతో లావణి సమ్రాదిని(క్వీన్ ఆఫ్ లావణి) బిరుదును సైతం స్వీకరించారు. ప్రముఖ లావని పాటలను పాడటంలో సులోచన ప్రసిద్ది చెందారు. 1965 నాటి చిత్రం మల్హరి మార్తాండ్, 1964లో వచ్చిన చిత్రం సవాల్ మజా ఐకా నుంచి సోలావా వరీస్ ధోక్యాచా, కసా కే పాటిల్ బరా హే కా పాటలు ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టాయి.
ఇవీ చదవండి: