ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయానికి వచ్చారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుందని వారు తెలిపారు.
ఓటీటీ రిలీజ్పై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై 50రోజుల తర్వాతే - ఓటీటీ రిలీజ్ ప్రొడ్యూసర్స్
ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయని చెప్పారు.
![ఓటీటీ రిలీజ్పై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై 50రోజుల తర్వాతే OTT Release Producers key decision](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15691533-thumbnail-3x2-ott-release.jpg)
భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. అలాగే హీరోల క్రేజ్ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చలు జరిపిన నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఓటీటీ రిలీజ్పై నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగు సినిమాలు ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి రానున్నాయి.
ఇదీ చూడండి: లావణ్య 'హ్యాపీ బర్త్డే' ట్రైలర్.. గన్లతో ఫన్.. కితకితలే!