తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అన్​స్టాపబుల్​' కోసం కోర్టుకు 'ఆహా'.. తక్షణమే ఆపాలని హైకోర్టు ఆర్డర్ - aha piracy

'అన్​స్టాపబుల్ 2' షో పైరసీపై ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా' దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పైరసీని నిలువరించేందుకు జాండో ఆర్డర్​ను తీసుకుంది. ఈ మేరకు 'ఆహా' ప్రతినిధులు ఓ సమావేశంలో వివరాలు వెల్లడించారు.

aha john doe order
aha john doe order

By

Published : Dec 30, 2022, 6:03 PM IST

ఆహా యాప్ లో వస్తోన్న 'అన్​స్టాపబుల్ 2' కంటెంట్ పైరసీకి గురవుతోందని.. దానిని నిలువరించేందుకు కోర్టు నుంచి జాండో ఆర్డర్ తీసుకున్నట్టు ఆహా ప్రతినిధులు ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని 'ఆహా' కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్, లీగల్ టీం సభ్యుడు ఆశిష్ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా.. దేశంలోనే మొట్టమొదటి సారిగా దిల్లీ హైకోర్టు నుంచి జాండో ఆర్డర్ పొందినట్టు ఆశిష్ తెలిపారు. దీని ప్రకారం అన్​స్టాపబుల్ కంటెంట్ పైరసీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించారు. జాండో ఆర్డర్​తో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసి.. వారి ద్వారా పైరసీ చేసే వారిపై చర్యలు తీసుకోనుందని అన్నారు. ఆయా వెబ్ సైట్లను బ్యాన్ చేయటం సహా మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.

'అన్​స్టాపబుల్​' కోసం కోర్టుమెట్లెక్కిన 'ఆహా'.. అది ఆపాలని హైకోర్టు ఆర్డర్

జాండో ఆర్డర్​ అంటే ఏమిటి?
ఇంటలెక్చువల్​ ప్రాపర్టీ హక్కులు లేదా మేధో సంపత్తి హక్కులను కాపాడేందుకు ఇచ్చే ఒక రకమైన ఇంజక్షన్ ఆర్డర్​నే జాండో ఆర్డర్​ అంటారు. మేధో సంపత్తి అనేది మనుషులు తమ తెలివితేటలతో సృష్టించే ఆవిష్కరణలు, కళాత్మక పనులు. సినిమాలు, పాటలు, సాహిత్యం లాంటివి కూడా మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తాయి. వీటికి చట్టపరమైన రక్షణ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details