Oscars 2023 Winners : ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 95వ వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ అట్టహాసంగా జరిగాయి. 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రం ఏకంగా ఏడు అవార్డులను అందుకుంది. మన దేశానికి రెండు విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలు లభించాయి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'RRR' చిత్రంలోని నాటునాటు పాటకి లభించగా.. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో 'ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్‌ను సంపాదించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ అవార్డ్.. తెలుగు పాటకు దక్కడం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. మరి ఈ వేడుకల్లో అవార్డులు సొంతం చేసుకున్నవారు ఎవరంటే..
- ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
- ఉత్తమ నటి: మిచెల్ యోహ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (RRR)
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: ఉమెన్ టాకింగ్
- బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
- ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నావల్నీ
- ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: యాన్ ఐరిష్ గుడ్‌బై
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: జేమ్స్ ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
- ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విస్పరర్స్
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
- ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్): వోల్కర్ బెర్టెల్మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్
- ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్