దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన సూపర్‌హిట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'పై సౌండ్ ఇంజనీర్, ప్రఖ్యాత అస్కార్ గ్రహీత.. రసూల్ పూకుట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాను 'గే లవ్ స్టోరీ' అంటూ ట్విట్టర్లో ఆదివారం కామెంట్ చేశారు. అయితే దీనిపై 'ఆర్ఆర్ఆర్' అభిమానులు రసూల్ పూకుట్టిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'నిన్న రాత్రి ఆర్ఆర్ఆర్ అనే చెత్త సినిమా 30నిమిషాలు చూశా' అని నటుడు, రచయిత మునీష్ భరద్వాజ్.. ఆదివారం ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన రసూల్ పూకుట్టి 'గే లవ్ స్టోరీ' రీ ట్వీట్ చేశారు. ఆలియా భట్‌ను ఆసరాగా ఉయోగించుకున్నారని, అమెకు ఎలాంటి ప్రాధాన్యం లేదని మరో ట్వీట్లో చెప్పుకొచ్చారు. దీనిపై రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులు కోపంగా రియాక్ట్ అవుతున్నారు. 'ఆస్కార్ స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేస్తారని అనుకోలేదు' అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడాన్ని జీర్ణించుకోలేకే.. ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.