బెస్ట్ ఒరిజినల్ స్కోరు విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి స్టార్ హీరో రజనీకాంత్ అభినందనలు తెలిపారు. కీరవాణి, రాజమౌళిలతో పాటు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రాన్ని తెరకెక్కించిన కార్తికి గోస్ సెల్వెన్కు కూడా శుభాకాంక్షలు చెప్పారు. ఒక భారతీయుడిగా గర్వంతో సెల్యూట్ చేస్తున్నానని అన్నారు.
Oscars Awards 2023 : 'నాటునాటు' పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారు: ప్రధాని మోదీ
14:22 March 13
సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు
14:19 March 13
తారక్‌తో మళ్లీ డ్యాన్స్ చేయాలని ఉంది : చరణ్
నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల రామ్‌చరణ్ స్పందించారు. "మా లైఫ్‌లోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో 'ఆర్‌ఆర్‌ఆర్' ఎంతో ప్రత్యేకమైనది. 'ఆస్కార్' అవార్డు మాకు దక్కేలా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేనింకా కలలోనే ఉన్న భావన కలుగుతోంది. రాజమౌళి, కీరవాణి.. ఇండియన్ సినిమాలో అత్యంత విలువైన రత్నాలు. 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి మాస్టర్‌పీస్‌లో నన్ను భాగం చేసిన వారిద్దరికీ కృతజ్ఞతలు. వరల్డ్ వైడ్‌గా 'నాటు నాటు' సాంగ్ అనేది ఓ ఎమోషనల్. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన గేయరచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్‌రక్షిత్‌కు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నా బ్రదర్ తారక్, కో-స్టార్ అలియాభట్‌కు ధన్యవాదాలు. ఎన్టీఆర్.. నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డ్స్ సృష్టించాలని భావిస్తున్నా. ఇండియన్ యాక్టర్స్ అందరికీ ఈ అవార్డు సొంతం. మాకు ఎంతగానో అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అని చరణ్ తెలిపారు.
11:48 March 13
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ అభినందనలు
'ఆర్ఆర్ఆర్(RRR)' నుంచి 'నాటు నాటు'కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మన దేశంలో టాలెంటుకు కొదవ లేదని.. అందరూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
11:32 March 13
మేము ఆస్కార్ సాధించాం: జూనియర్ ఎన్టీఆర్
- నాటునాటుకు ఆస్కార్‌పై ట్విట్టర్‌లో స్పందించిన ఎన్టీఆర్
- మేము ఆస్కార్ సాధించాం: జూనియర్ ఎన్టీఆర్
- కీరవాణి, జక్కన్న, చంద్రబోస్‌కు అభినందనలు: ఎన్టీఆర్
- ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి, దేశానికి అభినందనలు: ఎన్టీఆర్
11:22 March 13
'నాటునాటు' పాట సరిహద్దును చెరిపేసింది: మహేశ్‌బాబు
- 'నాటునాటు' పాట సరిహద్దును చెరిపేసింది: మహేశ్‌బాబు
- ఆర్‌ఆర్‌ఆర్ బృందానికి శుభాకాంక్షలు: మహేశ్‌బాబు
- ఆస్కార్ రావడం భారత సినిమాకు అద్భుతమైన ఘట్టం: మహేశ్
11:00 March 13
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు: బాలకృష్ణ
- ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు: బాలకృష్ణ
- నాటునాటుకు ఆస్కార్.. భారతీయ సినీచరిత్రలో అపూర్వ ఘట్టం: బాలకృష్ణ
- ఆస్కార్ సాధించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ బృందానికి అభినందనలు: బాలకృష్ణ
09:54 March 13
రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు
- రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు
- కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు: ప్రధాని మోదీ
- నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది: ప్రధాని మోదీ
- నాటునాటు పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారు: ప్రధాని మోదీ
09:28 March 13
భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: పవన్ కల్యాణ్
- భారతీయులు గర్విస్తున్న క్షణాలివి: పవన్ కల్యాణ్
- ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు: పవన్
- భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు ఈ అవార్డు స్ఫూర్తి: పవన్
09:24 March 13
నాటునాటు పాటకు ఆస్కార్ దక్కడం అభినందనీయం: వెంకయ్యనాయుడు
- నాటునాటు పాటకు ఆస్కార్ దక్కడం అభినందనీయం: వెంకయ్యనాయుడు
- చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు: వెంకయ్యనాయుడు
- చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన సతీమణి సుచిత్ర
- చంద్రబోస్‌కు అవకాశం ఇచ్చిన రాజమౌళి, కీరవాణికి కృతజ్ఞతలు: సుచిత్ర
09:13 March 13
ఉత్తమ చిత్రంగా 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'
- ఉత్తమ చిత్రం- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
- ఉత్తమ దర్శకుడు- డానీయల్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
- ఉత్తమ నటుడు- బ్రెండాన్ ఫ్రాసర్ (ద వేల్)
- ఉత్తమ నటి- మిఛెల్ యో(ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
09:06 March 13
'నాటునాటు' పాట ప్రపంచ శిఖరాగ్రాన నిలిచింది: చిరంజీవి
- నాటునాటుకు ఆస్కార్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
- రాజమౌళి బృందానికి ప్రముఖుల ప్రశంసలు
- 'నాటునాటు' పాట ప్రపంచ శిఖరాగ్రాన నిలిచింది: చిరంజీవి
- రాజమౌళి ధైర్యం, దార్శనికతతోనే అద్భుతం సాకారం: చిరంజీవి
- ఆర్‌ఆర్‌ఆర్.. కోట్లాది భారతీయుల హృదయాలను గర్వపడేలా చేసింది: చిరంజీవి
- భారతీయ, తెలుగుచిత్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటారు: చంద్రబాబు
- రాజమౌళి, చిత్ర బృందానికి అభినందనలు: చంద్రబాబు
- నాటునాటు పాటకు ఆస్కార్ రావడం దేశానికే గర్వకారణం: లోకేశ్
- ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు: నారా లోకేశ్
- ఆస్కార్ సాధించిన ఎలిఫెంట్ విస్పర్స్ బృందానికి శుభాభినందనలు: లోకేశ్
09:02 March 13
'RRR ప్రతి భారతీయుడికి గర్వకారణం'.. ఆస్కార్ అందుకున్న కీరవాణి, చంద్రబోస్
Oscar 2023 : యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురూచూసిన ఆస్కార్ అవార్డ్ RRR ను వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాట విజయకేతనం ఎగరవేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అవార్డును స్వీకరించారు. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం పురస్కారంతో అభివాదం చేశారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసిన కీరవాణి భావోద్వేగంతో ప్రసంగించారు. "నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే RRR గెలవాలి. ఇది ప్రతి భారతీయుడి గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసింది." అని కీరవాణి తెలిపారు.
08:28 March 13
'ఆర్‌ఆర్‌ఆర్'కు ఆస్కార్.. తొలి భారతీయ గీతంగా రికార్డ్
ఆస్కార్ వేదికపై 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలోని 'నాటునాటు' పాట గెలుపుబావుటా ఎగురవేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పురస్కారాన్ని ముద్దాడింది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది.
07:56 March 13
విజువల్ వండర్ అవతార్
అవతార్-2 చిత్రానికి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అవార్డు వచ్చింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ ఫిదా అయింది.
07:24 March 13
భారతీయ షార్ట్ ఫిల్మ్‌కు ఆస్కార్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ను ఆస్కార్ వరించింది.
07:15 March 13
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జర్మనీ చిత్రం 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' అవార్డు గెలుచుకుంది. ఈ విభాగంలో అర్జెంటీనా 1985 (అర్జెంటీనా), క్లోజ్ (బెల్జియం), ఈఓ (పోలండ్), దిక్వైట్ గర్ల్ (ఐర్లాండ్) చిత్రాలు పోటీ పడ్డాయి.
06:55 March 13
Oscars Awards 2023 : భారతీయ చిత్రానికి బ్యాడ్‌లక్.. లభించని ఆస్కార్
Oscars Awards 2023 : ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రానికి నిరాశ ఎదురైంది. 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్' విభాగంలో నామినేట్ అయిన 'ఆల్ దట్ బ్రెత్స్'కు ఆస్కార్ దక్కలేదు. ఈ విభాగంలో 'నావల్నీ' డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ లభించింది.
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్ 2023 వేడుక ఘనంగా ప్రారంభమైంది. హాలీవుడ్‌కు చెందిన తారలు, సినీ ప్రముఖులతో పాటు, ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఈ వేడుకలకు హాజరయ్యారు. హాలీవుడ్ తారమణులు అందాలను ఆరబోస్తూ అదిరిపోయే దుస్తుల్లో దర్శనమిచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకుల కలను అడుగు దూరంలో నిలిపిన 'RRR' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సహా కీరవాణి, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ హాజరయ్యారు.