oscar awards 2023 : ఆస్కార్‌కు వేళాయే.. 'నాటు నాటు'కు ఓటు దక్కేనా! - ఆస్కార్ 2023 రేసులో లేడి గాగా
oscar awards 2023 : భారతీయ సినీ పరిశ్రమకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టడమే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు పొందింది 'ఆర్ఆర్ఆర్'. ఆ సినిమాలోని 'నాటు నాటు.. ' పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ బరిలో నిలించింది. ఈ పాటతో పాటు రేసులో ఉన్న మిగతా పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. లేడీ గాగా, రిహాన్నా లాంటి అంతర్జాతీయ గాయకులు పాడిన ఈ పాటలు.. నెట్టింట వైరలయ్యాయి. ఇంతకీ ఆ పాటలేంటో? వాటి వెనుకల ఉన్న కథేంటో? ఓ సారి చూసేద్దామా..
దగ్గజ దర్శకుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఆ సినిమాలోని 'నాటు నాటు..' అంటూ సాగే పాట ఆస్కార్ రేసులో నిలిచింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ పాట.. మొదటి సారి గోల్డెన్ గ్లోబ్ వేదికపై అవార్డు సొంతం చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటం మొదలెట్టారు. ఇక ఈ పాటకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సంగీత ప్రియులు ఈ పాటను లూప్‌లో పెట్టుకుని మరీ వింటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఈ పాట ఆస్కార్‌కు నామినేట్ అయి దేశానికే గర్వకారణంగా నిలించింది. ఎలాగైనా ఆస్కార్‌ను భారత్‌కు తీసుకుని రావాలని అటు 'ఆర్ఆర్ఆర్' టీమ్‌తో పాటు భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 'నాటు నాటు'తో పాటు ఆస్కార్ రేసులో ఉన్న మిగతా పాటల కూడా గుర్తింపు పొందాయి. లేడీ గాగా, రిహాన్నా లాంటి ఇంటర్నేషనల్ సింగర్స్ పాడిన ఈ పాటలు నెట్టింట ఎంతో శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక ఆ పాటల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..
- దర్శక ధీరుడు జక్కన్న మాస్టర్ పీస్ 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు..' సాంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కీరవాణి బాణీలు కట్టిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం ఊపిరి పోసింది. ఇక రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గాత్రంతో అందరిని మైమరిపించగా.. ప్రేమ్ రక్షిత్ స్టెప్పులు పాటకే హైలైట్‌గా నిలిచింది. ప్రతిష్టాత్మక గోల్డెన్గ్లోబ్తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ పాటకు.. ఎన్టీఆర్, రామ్‌చరణ్ వేసిన స్టెప్పులు భాష, ప్రాంతాలకు అతీతంగా అందరిని ఉర్రూతలూగించాయి.
- హాలీవుడ్‌లోని 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' సినిమాలోని 'అప్లాజ్' అనే పాట ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. ప్రముఖ అమెరికన్ రచయిత డయాన్ వారెన్ రాసిన ఈ పాటను సోఫియా కార్సన్ ఆలపించారు. అయితే 'అప్లాజ్' అనే ఈ పాట.. స్త్రీ సాధికారత గురించి, మనల్ని మనం గౌరవించుకోవాలనే విషయాలను తెలియజేసేలా చక్కగా రాశారు రచయిత.
- ఇక ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నామినేషన్ దక్కించుకున్న మరో పాట 'బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవర్' చిత్రంలోని 'లిఫ్ట్ మీ అప్'. టేమ్స్, నైజీరియా గాయకుడు ర్యాన్ కూగ్లర్ రాసిన ఈ పాటకు. రిహాన్నా, టేమ్స్, ర్యాన్ కూగ్లర్, లుడ్విగ్ గోరావ్సన్ సంగీతం సమకూర్చారు. బార్బాడియన్ గాయని, నటి రిహాన్నా ఈ పాటను తనదైన శైలీలో ఆలపించారు సంగీత ప్రియులను అలరించారు. కాగా గత రెండేళ్లలో రిహాన్నా పాడిన పాటల్లో గొప్పదిగా నిలిచింది. ప్రముఖ అమెరికన్ నటుడు చాడ్విక్ బోస్మెన్కు నివాళిగా ఈ పాటను అంకితం చేసింది 'బ్లాక్ పాంథర్' మూవీ టీమ్.
- 95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రంలోని 'దిస్ ఇజ్ ఎ లైఫ్' కూడా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. ర్యాన్ లాట్, డేవిడ్ బైర్న్ ఈ పాటను రాయడమే కాకుండా సంగీతాన్ని కూడా అందించారు. ప్రముఖ స్కాటిష్- అమెరికా గాయకుడు డేవిడ్ బైర్నే, మిట్స్కీలు ఈ పాటను పాడారు.
- అమెరికన్ సింగర్ లేడి గాగా రాసిన 'హోల్డ్ మై హ్యాండ్' అనే పాట కూడా ఆస్కార్ రేసులో నామినేట్ అయ్యింది. 'టాప్ గన్:మావెరిక్' సినిమాలోని ఈ పాట కోసం లేడి గాగాతో పాటు బ్లడ్ పాప్ గొంతు కలిపారు. ఈ పాటకుగాను ఆమెకు పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు దక్కాయి. అయితే ఈ విభాగంలో గాగాకు ఇది మూడో నామినేషన్ కాగా 2019లో పురస్కారం కూడా గెలుచుకుంది.
- ఇదీ చదవండి:
- NTR 30లో జాన్వీ.. ప్రాజెక్ట్-Kలో దీపిక.. టాలీవుడ్ వైపు బీటౌన్ బ్యూటీల అడుగులు!
- ఆస్కార్ వేడుకకు అంతా రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎలా చూడొచ్చు?