ఆస్కార్ సందడి మొదలైపోయింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ఎవరు విజేతలుగా నిలుస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఈసారి మనకు ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో నామినేషన్లు దక్కిన సంగతి తెలిసిందే. డాక్యుమెంటరీ విభాగంలో భారతీయ చిత్రం ఆల్ దట్ బ్రీత్ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేటగిరీలో నామినేషన్లు అందుకున్న ఇతర చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి?
మన కథకు అందలం
భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. శౌనక్ సేన్ తెరకెక్కించిన ‘ఆల్ దట్ బ్రీత్’ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఈ ఏడాదికి ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఈ డాక్యుమెంటరీని అమన్ మన్, టెడ్డీ లీఫర్ నిర్మించారు. పర్యావరణ కాలుష్యం, ముఖ్యంగా గాలిపటాల వల్ల కలిగే ప్రమాదాల నుంచి బ్లాక్ కైట్స్ అని పిలిచే పక్షులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేస్తారు దిల్లీకి చెందిన సోదరులు నదీమ్ షెహజాద్, మహమ్మద్ సౌద్. గాయపడిన పక్షుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. విషపూరితమైన పర్యావరణం, సామాజిక అశాంతి మధ్య ఆ సోదరులు జీవుల సంరక్షణలో పగలు రాత్రి గడుపుతారు. గాయపడిన పక్షులు ఆకాశంలో తిరిగి ఎగరడానికి ఆ సోదరులు చేసిన సహాయాన్ని, వారి మధ్య అనుబంధాన్ని ఇందులో చూపించారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జ్యూరీ బహుమతిని, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీగా ‘గోల్డెన్ ఐ’ అవార్డును ఈ డాక్యుమెంటరీ సొంతం చేసుకుంది. దీనిని జనవరి 22, 2022లో విడుదల చేశారు.
అగ్నిపర్వత ప్రేమకథ..
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ దక్కించుకున్న మరో చిత్రం ‘ఫైర్ ఆఫ్ లవ్’. ఈ అమెరికన్ డాక్యుమెంటరీని శరదోసా తెరకెక్కించారు. షేన్ బోరిస్, ఐనా ఫిచ్మాన్ నిర్మించారు. ఇద్దరు ఫ్రెంచ్ అగ్నిపర్వత శాస్త్రవేత్తలైన కాటియా, మారిస్ క్రాఫ్ట్‌ల జీవితాలు, వారి అసాధారణమైన ప్రేమకథ గురించి ఈ సినిమాలో చూపించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘జోనాథాన్ ఓపెన్‌హీమ్ ఎడిటింగ్’ అవార్డును అందుకుంది. జూలై 6, 2022లో ఈ డాక్యుమెంటరీని విడుదల చేశారు.
నవల్నీ విషప్రయోగం చుట్టూ