ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ ప్రదానోత్సవ వేడుక ఘనంగా జరిగింది. వరల్డ్ వైడ్‌గా సినీ సెలబ్రిటీలతో పాటు నామినేషన్స్ కేటగిరిలో ఉన్న నటీనటులు, మిగతా టెక్నిషియన్స్ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. భిన్న డ్రెస్సుల్లో కనిపించి కనువిందు చేశారు. ముఖ్యంగా భారతీయ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. వారందరూ కోరుకున్నట్టే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన నాటు నాటు సాంగ్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డ్ అందుకున్న తొలి భారతీయ, తెలుగు గీతంగా చరిత్ర సృష్టించింది. సాంగ్ లిరిసిస్ట్ చంద్రబోస్, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. ఆస్కార్ వేదికపై అవార్డును అందుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
అయితే ఈ సారి ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో కొన్ని కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. గెస్ట్‌లకు రెడ్ కార్పెట్ మీద కాకుండా షాంపైన్ మీద ఆహ్వానం పలికారు. అంటే ఎర్ర రంగు కార్పెట్‌ను షాంపైన్ కలర్లోకి మార్చారు. ఆస్కార్ చరిత్రలోనే ఇలా మార్చడం తొలిసారి. దాదాపు 50 వేల స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర. రూ. 24,700 డాలర్స్ ఉంటుందని తెలిసింది. దీన్ని ఏర్పాటు చేయడానికి 600 గంటలు సమయం పట్టిందని తెలిసింది.