Ooru Peru Bhairavakona Trailer :యంగ్ హీరో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ లీడ్ రోల్స్‌లో రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైవరకోన'. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ తరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం థిల్లింగ్ సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 'టైగర్' తర్వాత సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడం విశేషం.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే తొలుత లవ్ సాంగ్‌తో మొదలైన ఈ ట్రైలర్ ఆ తర్వాత ఒక్కసారిగా భైరవకోన అనే ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. గరుడ పురాణం, కర్మ సిద్ధాంతం అనే రెండు అంశాల గురించి ఈ సినిమాలో మాట్లాడారని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. ' గరుడ పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన', 'భగవంతుడు ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. లిఖించబడిందే జరుగుతుంది, రక్తపాతం జరగని' అనే డైలాగ్‌తో ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.