ప్రముఖ నటుడు కృష్ణ కుటుంబం నుంచి మరో హీరో పరిచయం కాబోతున్నారు. ఆయనెవరో కాదు సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు, నటుడు నరేశ్ అల్లుడు శరణ్‌కుమార్. ఈయన హీరోగా 'మిస్టర్ కింగ్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.
శరణ్ గురించి తెలియని కొందరు సినీ అభిమానులు 'ఈ హీరో ఎవరా?' అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శరణ్ ఎవరో తెలిసేలా ఓ వీడియోను రూపొందించి, విడుదల చేసింది. అందులో కృష్ణ, నరేశ్, సుధీర్‌బాబు తమ ఫ్యామిలీ నుంచి రాబోతున్న శరణ్‌కు శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు. ఇప్పటివరకూ కృష్ణ కుటుంబం నుంచి ఏడుగురు నటులు ప్రేక్షకులను అలరించగా.. తాజాగా ఎనిమిదో యాక్టర్‌గా శరణ్ వస్తున్నారు. తన తాత కృష్ణ నుంచి ఎంతో స్ఫూర్తిపొందానని శరణ్ తెలిపారు.