క్రిస్మస్ సందర్భంగా చాలా మంది తమ తమ ప్రియమైన వారికి బహుమతులు అందజేస్తారు. అయితే దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా.. తన స్నేహితురాలు సమంతకు ఒక అందమైన మోమెంటోను బహుకరించారు. రాహుల్ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెబుతూ సామ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో గిఫ్ట్ ఫొటోను షేర్ చేశారు.
క్రిస్మస్ సెలబ్రేషన్స్.. సమంతకు రాహుల్ 'స్పెషల్' గిఫ్ట్! - సామ్‌కు బహుమతి పంపిన డైరెక్టర్ రాహుల్
క్రిస్మస్ పండగను పురస్కరించుకుని నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్.. హీరోయిన్ సమంతకు బహుమతి పంపారు. దానిని సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.
సామ్‌ను ప్రశంసిస్తూ 'ఉక్కు మహిళ' అని ట్యాగ్ చేశారు రాహుల్. 'ఉక్కు మహిళ సొరంగం చీకటిగా ఉంది. దానికి ముగింపు లేదని తెలుస్తోంది. వెలుగు కనిపించే సూచన లేదు. మీ పాదాలు బరువెక్కాయి..కానీ మీరు వాటితోనే నడుస్తున్నారు. నీ సందేహాలను, భయాందోళనలను నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు ఉక్కుతో తయారయ్యావు. ఈ విజయం నీ జన్మహక్కు, నువ్వు నడుస్తూనే ఉండు. త్వరలో సూర్యుడి వెలుగు ప్రకాశిస్తుంది. ఇలాంటివి చాలానే ఉంటాయి. మీలాంటి యోధులు మాత్రమే పోరాటంలో గెలుస్తారు' అంటూ రాహుల్ రవీంద్రన్ తన సందేశాన్ని మోమెంటోలో రాశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయితో సమంతకు మంచి స్నేహం ఉంది. సమంత పాత్రలకు చిన్మయి డబ్బింగ్ కూడా చెబుతుంటారు.