OG Hungry Cheetah Song : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'OG'(ఒరిజినన్ గ్యాంగ్‌స్టర్). ఒక్క రోజు గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తూ అభిమానులకు పూనకాలు తెప్పించేస్తున్నాయి. దీంతో మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. #HUNGRYCHEETAH హ్యాష్ ట్యాగ్‌తో గ్యాప్ లేకుండా సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా హంగ్రీ చీతా గ్లింప్స్ రిలీజ్ చేసిన ఇప్పుడు మూవీటీమ్.. ఇప్పుడు రేజ్ ఆఫ్ #HungryCheetah ATTACKS పేరుతో సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఈ పాట అదిరిపోయే మ్యూజిక్‌తో పవన్ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. తమన్ అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించేస్తోంది.
OG Cast And Crew : ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయింది. అయితే పవన్ పుట్టినరోజు వచ్చేంత వరకు సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. కానీ బర్త్‌డే సందర్భంగా మాత్రం పూనకాలు తెప్పించే గ్లింప్స్ రిలీజ్ చేసి.. సినిమాపై ఊహకందని రేంజ్లో హైప్‌ను పెంచేశారు. ఇకపోతే ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా పలువురు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇకపోతే పవన్ కల్యాణ్ ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను చూస్తున్నారు. బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి. హరిహర వీరమల్లు మోషన్ పోస్టర్ రాగా, ఉస్తాద్ భగత్ సింగ్‌కు సంబంధించి కొత్త పోస్టర్స్ వచ్చాయి. కానీ వీటికన్నా ఓజీ గ్లింప్సే అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.