OG Glimpse : రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడాయన చేతిలో 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాలు ఉన్నాయి. అందులో యంగ్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం 'OG'. 1990 నాటి ముంబయి మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందుతోంది. దీంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. ముంబయిలో పలు షెడ్యూళ్లను కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే 50 శాతంపైగా టాకీ పార్టును పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇప్పటివరకు రాలేదు. అయితే ఇటీవలే.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో ఓ గ్లింప్స్‌ను(FireStormIsComing) పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు మేకర్స్.
OG Glimpse Pawan Kalyan :ఈ గ్లింప్స్‌లో కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని రెండు మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. ఈ మూవీ గ్లింప్స్ వీడియో 72 సెకెన్లు లేదా 1.12 నిమిషాల నిడివితో రాబోతుందని తెలిసింది.