తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బ్రెయిన్​ క్యాన్సర్​తో ​నటి మృతి.. సినీ ప్రముఖుల సంతాపం - ఒడియా నటి రాజేశ్వరీ

ప్రముఖ ఒడియా నటి, యాంకర్​ రాజేశ్వరి మోహపాత్ర మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్​తో పోరాడుతున్న ఆమె గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాజేశ్వరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

rajeshwari mohapatra
రాజేస్వరీ మోహపాత్ర

By

Published : Jul 21, 2022, 12:48 PM IST

ఒడియా ఇండస్ట్రీ ఓలీవుడ్​కు చెందిన ప్రముఖ నటి, యాంకర్​ రాజేశ్వరీ రే మోహపాత్ర కన్నుమూశారు. స్టేజ్​ 4 క్యాన్సర్​తో బాధపడుతున్న ఆమె బుధవారం ఆస్పత్రిలో చేరారు. అయితే చికిత్స పొందుతున్న క్రమంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల క్యాన్సర్​తో బాధపడుతున్న రాజేశ్వరీకి ఆ వ్యాధి మెదడుకు కూడా పాకింది. నాలుగో దశకు చేరుకున్న ఈ వ్యాధికి 2019 ఏప్రిల్​ నుంచి ఆమె చికిత్స తీసుకుంటున్నారు.

రాజేశ్వరి మోహపాత్ర
రాజేశ్వరి మోహపాత్ర

రాజేశ్వరి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. యాంకర్​గా తన కెరీర్​ను ప్రారంభించిన రాజేశ్వరి.. సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నెగటివ్​ రోల్స్​లో తనదైన శైలిలో నటించి రాజేశ్వరి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీరియళ్లే కాకుండా పలు సినిమాల్లో కూడా నటించి ఒడియా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు రాజేశ్వరి.

ఇదీ చూడండి :మరోసారి తల్లికాబోతున్న ఐశ్వర్య.. ఇదిగో ప్రూఫ్​!

ABOUT THE AUTHOR

...view details