తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​.. వీడియో చూశారా? - Tiger Nageswara Rao Release Date

ODI World Cup 2023 Ind Vs Aus Tiger Nageswara Rao : టీమ్​ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్​లో మాస్ మహారాజా రవితేజ సందడి చేశారు. కోహ్లీ పట్టుకున్న సూపర్ క్యాచ్​పై కామెంట్స్ చేశారు. వీడియో చూశారా?

ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​
ODI World Cup 2023 : భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో 'టైగర్​ నాగేశ్వరరావు'.. కోహ్లీ సూపర్​ క్యాచ్​పై కామెంట్స్​

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 3:58 PM IST

ODI World Cup 2023 Ind Vs Aus Tiger Nageswara Rao :టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్​లో భాగంగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఈవెంట్లలో పాల్గొంటున్నారు. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి గ్యాప్​ లేకుండా బాగా శ్రమిస్తున్నారు. తాజాగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా.. టీమ్​ఇండియా - ఆస్ట్రేలియా మధ్య వన్డే వరల్డ్‌ కప్‌ మ్యాచ్​ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్ తెలుగు లైవ్ కామెంటరీ ప్యానెల్​లో రవితేజ సందడి చేశారు. వ్యాఖ్యాతలతో కలిసి కామెంటరీ చేశారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. క్రికెట్ అభిమానులతోనూ ముచ్చటించారు. షోలో తన ఎనర్జీతో ఊపు తెప్పించారు. అలాగే ఈ మ్యాచ్​లోనూ శతకాలు నమోదు అవ్వాలని రవితేజ ఆశించారు. మనోళ్లు గెలవాలని ఆల్​ ది బెస్ట్ చెప్పారు. ​ సిరాజ్ -​ కోహ్లీ ఇంటే తనకు ఇష్టమని చెప్పిన ఆయన.. విరాట్​లో ఉండే అగ్రెషన్​, యాటిట్యూడ్​, లుక్​ తనకెంతో ఇష్టమని అన్నారు. కోహ్లీలో ఆత్మవిశ్వాసం బాగా ఉంటుందని, అది తనకెంతో నచ్చుతుందని చెప్పుకొచ్చారు. అతడి ఫిట్​నెస్​ కూడా బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో మిచెల్ మార్ష్​ బాదిన బంతిని కోహ్లీ అద్భుతంగా క్యాచ్​ పట్టుకున్నాడని ప్రశంసించారు.

అలాగే టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్​లో భాగంగానే.. మరి కొన్ని గంటల్లో ప్రసారం కానున్న తెలుగు బిగ్​ బాస్​ 7 వీకెండ్​ సండే షోలోనూ రవితేజ సందడి చేయనున్నారు. తన టైగర్ టీమ్​తో కలిసి పాటలు, డ్యాన్స్​లతో ఎనర్జీ పెర్​ఫార్మెన్స్​ చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు, ఫొటోలు బయటకు వచ్చి ఆకట్టుకున్నాయి.

Tiger Nageswara Rao Release Date :కాగా, ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. జీషూ సేన్ గుప్తా, రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

ODI WorldCup 2023 Aus VS Ind : చరిత్ర సృష్టించిన కోహ్లీ - వార్నర్.. ఆ అరుదైన సచిన్ రికార్డ్ బ్రేక్​

Boyapati Srinu Upcoming Movies : బోయపాటి లైనప్‌... మహేశ్​-సూర్యతో సినిమా.. ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details