తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నువ్వే నువ్వే'కు 20 ఏళ్లు.. ఈ డైలాగ్స్​ ఇప్పటికీ బ్లాక్​బస్టర్లే..! - నువ్వే నువ్వే మూవీ తరుణ్​ డైలాగ్స్​

తరుణ్​, శ్రియ జంటగా నటించిన ఫ్యామిలి ఎంటర్టైనర్​ 'నువ్వే నువ్వే'. మాటల మాంత్రికుడు తొలిసారి మెగాఫోన్​ పట్టుకున్న ఈ సినిమా ఎన్నో అవార్డులతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. అప్పట్లో బాగా హిట్​ అయిన ఈ సినిమా నుంచి కొన్ని పాపులర్​ డైలాగ్స్​ మీ కోసం..

nuvve nuvve @ 20 years
nuvve nuvve

By

Published : Oct 9, 2022, 6:54 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వం వహించిన ఫ్యామిలి ఎంటర్టైనర్​ 'నువ్వే నువ్వే'. తరుణ్,​ శ్రియ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్​ రాజ్​ కీలక పాత్ర పోషించారు. సెంటిమెంటల్​గానూ, కామెడీ పరంగానూ ప్రేక్షకుల మెప్పును పొందడమే కాకుండా.. అవార్డులు సైతం సొంతం చేసుకున్న చిత్రంగా 'నువ్వే నువ్వే' నిలిచింది. తరుణ్​, శ్రియ లవ్​లీ నటన, ప్రకాష్​ రాజ్​ తండ్రి సెంటిమెంట్​తో పాటు సునీల్​ స్పాంటేనియస్​ డైలాగ్స్​ ఈ సినిమాకు హైలైట్స్​గా నిలిచాయి. సునీల్​ కామెడీ డైలాగ్స్​తో అందరిని నవ్విస్తే.. ప్రకాష్​ రాజ్ నాన్న పాత్రలో చెప్పే డైలాగ్స్​ ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించాయి.. ఇలా త్రివిక్రమ్​ పెన్​ నుంచి జాలువారిన ఒక్కో డైలాగ్​ ఇప్పటికి అందరి నోట్లో నానుతూనే ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలు పుర్తి చేసుకున్న ఈ బ్లాక్​ బస్టర్​ మూవీలోని కొన్ని ఫేమస్​ డైలాగ్స్​ మీ కోసం...

  • డబ్బుతో బ్రెడ్ కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ కొనగలరు, నిద్రని కొనలేరు.
  • ఎక్కడికి వెళ్లాలో తెలిసినప్పుడు... ఎలా వెళ్లాలో చెప్పడానికి నేనెవర్ని?
  • మనం తప్పు చేస్తే తప్పని, కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచివాళ్లు. మనం ఏం చేసినా భరించే వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు.
  • నీ జీవితంలో వంద మార్కులు ఉంటే 20 నాకు, 80 వాడికి. ఇంకో పదిహేను మార్కులు వేసి మీ నాన్నను పాస్ చేయలేవమ్మా?
  • అమ్మ, ఆవకాయ్, అంజలి... ఎప్పుడూ బోర్ కొట్టవు.
  • కన్నతల్లిని, దేవుణ్ణి మనమే వెళ్లి చూడాలి. వాళ్ళు మన దగ్గరకు రావాలని కోరుకోవడం మూర్ఖత్వం.
  • ప్రేమించే వయసులో పోషించే శక్తి ఉండదు... పోషించే శక్తి వచ్చేసరికి ప్రేమించే టైం ఉండదు.
  • నేను దిగడం అంటూ మొదలుపెడితే ఇది మొదటి మెట్టు. దీని బట్టి నా ఆఖరి మెట్టు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి.
  • సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
  • తాజ్ మహల్... చార్మినార్... నాలాంటి కుర్రాడు చూడటానికే! కొనడానికి మీలాంటి వాళ్ళు సరిపోరు.
  • ఒకడు రిక్షా తొక్కడం దగ్గర మొదలుపెట్టి కోటీశ్వరుడు అయ్యాడు కదా అని... వారి కొడుక్కి కొత్త రిక్షా కొనిపెట్టి ఎదగమనడం అంత బాగుండదు.
  • ఆడపిల్లలు పుట్టినప్పుడు వాళ్లు ఏడుస్తారు. పెళ్లి చేసుకొని వెళ్లేటప్పుడు మనల్ని ఏడిపిస్తారు.
  • డబ్బులు ఉన్నవాళ్ళంతా ఖర్చుపెట్టలేరు. ఖర్చు పెట్టేవాళ్లంతా ఆనదించలేరు.

ABOUT THE AUTHOR

...view details