బింబిసార చిత్రంపై ప్రశంసలు ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్ అన్నారు. ప్రేక్షకుల నుంచి 'బింబిసార'కు వస్తోన్న స్పందనపై తాజాగా తారక్ ట్వీట్ చేశారు. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.
కల్యాణ్‌రామ్‌పై ఎన్టీఆర్ ట్వీట్.. అది ఇంకెవ్వరూ చేయలేరంటూ.. - బింబిసార న్యూస్
కల్యాణ్‌రామ్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు హీరో ఎన్టీఆర్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..
"బింబిసార' సినిమా గురించి గొప్ప విషయాలు వింటున్నా. కల్యాణ్ రామ్ అన్నా.. ఈ సినిమాలో రాజుగా నిన్ను ఎవరూ భర్తీ చేయలేరు. వశిష్ఠ.. తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించావు. ఇక, ఈ చిత్రానికి కీరవాణి గారే వెన్నెముక. ఆయన అందించిన స్వరాలు అద్భుతంగా ఉన్నాయి" అని చిత్రబృందం మొత్తానికి ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రంలో కల్యాణ్‌రామ్ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించారు. సంయుక్తా మేనన్, కేథరిన్ కథానాయికలుగా అలరించారు.
ఇదీ చూడండి :కమల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మళ్లీ సెట్స్‌పైకి భారతీయుడు-2.. RC15 షూట్‌కు బ్రేక్!