యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఒకరు. అందుకే 'నటనలో నీ తర్వాతే ఎవరైనా' అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్‌కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్‌లో జోష్, ఫైట్స్‌లో ఎన్టీఆర్ స్పీడ్‌కు సిల్వర్‌స్క్రీన్ సైతం ఊగిపోవాల్సిందే. ఇటీవల విడుదలైన 'ఆర్‌ఆర్‌ఆర్'తో ఆయన క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో తారస్థాయికి చేరింది.
తాజాగా రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం శుక్రవారం జపాన్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రచారం కోసం జపాన్ వెళ్లిన హీరోలు ఇద్దరు.. అక్కడి అభిమానులతో కలిసి సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నివ్వెరపోతున్నారు. అయితే ఎన్టీఆర్‌లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అనేక భాషలు మాట్లాడడం. సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొంతమంది సౌత్ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో రెండు దక్షిణాది భాషలను మాట్లాడగలతారు. కానీ ఎన్టీఆర్ మాత్రం అనర్గంలా దాదాపు తొమ్మిది భాషలు మాట్లాడతారు. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, స్పాన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు జపాన్‌లో ఉన్న ఆయన.. స్టేజ్‌పై జపనీస్ భాషలోనూ మాట్లాడారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు తెగ మురిసిపోతున్నారు.