RRR Tiger fight: యంగ్ టైగర్ తారక్-మెగాహీరో రామ్‌చరణ్ కాంబోలో తెరకెక్కిన విజువల్ వండర్ సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్‌కి పెద్ద పీట వేశారు. పులితో ఎన్టీఆర్ చేసే పోరాటం, ఓ సన్నివేశంలో రామ్‌చరణ్-పులి ఫైట్, చరణ్‌పై పాము దాడి చేయడం.. ఇలాంటి ఎన్నో షాట్స్‌కి వీఎఫ్‌ఎక్స్ ఉపయోగించారు.
'ఆర్‌ఆర్‌ఆర్'.. టైగర్ ఫైట్ ఎలా చిత్రీకరించారంటే? - RRR tiger fight
RRR Tiger fight: 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో పులితో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చేసే పోరాటం, చరణ్‌పై పాము దాడి చేయడం వంటి సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఆ సీన్స్ ఎలా రూపొందించారో ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీటీమ్. దాన్ని చూసేద్దాం..

అయితే, ఆయా సన్నివేశాల్లో AlzahraVFX సంస్థ విజువల్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేసిందో తెలియజేస్తూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. పులి, పాముని సృష్టించడానికి సదరు సంస్థ 18 వీఎఫ్‌ఎక్స్ షాట్స్‌ని క్రియేట్ చేసిందని పేర్కొంది. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామ్‌చరణ్, తారక్ తొలిసారి ఈ సినిమా కోసం కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురంభీమ్‌గా నటించారు. చరణ్ జోడీగా ఆలియా, తారక్‌కు జంటగా ఒలీవియా మోరీస్ కీలకపాత్రలు పోషించారు.
ఇదీ చూడండి: డబ్బులు చెల్లించనక్కర్లేదు.. ఓటీటీలో ఫ్రీగానే ఆర్‌ఆర్‌ఆర్