NTR Oscar : జూనియర్ ఎన్టీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ వేదికపై సందడి చేసిన తారక్... అదే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ లో కొత్త సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అకాడమీ అధికారికంగా ప్రకటించింది. అంకితభావం కలిగిన నటీనటుల్లో తారక్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఆకర్షించారని, తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులు సొంతం చేసుకున్నట్లు అకాడమీ వెల్లడించింది. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటీనటులు తమ యాక్టర్స్ బ్రాంచ్ లోకి ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. తారక్ తోపాటు మరో నలుగురు హాలీవుడ్ నటులకు అకాడమీ కొత్త సభ్యులుగా చేర్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానుల్లో ఎనలేని ఉత్సాహాం నెలకొంది.
"అంకితభావం కలిగిన ఈ నటీనటులు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షించారు. తెరపై వారి హావభావాలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి గొప్ప నటీనటులను 'యాక్టర్స్ బ్రాంచ్'లోకి ఆహ్వానిస్తున్నాం" అని అకాడమీ రాసుకొచ్చింది.