NTR Koratala movie: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. మే 20 తారక్ పుట్టినరోజు సందర్భంగా.. కొరటాల శివతో చేయబోయే మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తారక్ కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించి పూనకాలు తెప్పించారు.
NTR 30: కత్తి పట్టుకుని మాస్‌లుక్‌లో ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే.. - ఎన్టీఆర్ 30 కొరటాల శివ సినిమా
NTR Koratala movie: ఎన్టీఆర్-కొరటాల కాంబోలో రానున్న సినిమా నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్డేట్ వచ్చింది. ఇందులో తారక్ కత్తి పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించి పూనకాలు తెప్పించారు.
"అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మించి తాను ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి తాను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా" అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అదిరిపోయింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, సముద్రంలో ఎగిసి పడుతున్న అలలు, అందులో ప్రయాణిస్తున్న పడవలతో ఆద్యంతం వీడియో అదిరిపోయింది. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మొత్తంగా ఈ సినిమా పవర్ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ 30గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రశాంత్‌నీల్‌తో చేయబోయే సినిమా అప్డేట్ మే 20న రానుంది.
ఇదీ చూడండి: ఈషా బోల్డ్ క్లీవేజ్ షో.. మళ్లీ మళ్లీ చూడాలనిపించేంతగా!