తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NTR Devara Update : రెండు పార్ట్​లుగా NTR 'దేవర'.. డైరెక్టర్ కొరటాల శివ వీడియో రిలీజ్​ - devara update today

NTR Devara Update : జూనియర్ ఎన్​టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు దర్శకుడు కొరటాల శివ. తారక్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

NTR Devara Update
NTR Devara Update

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 5:53 PM IST

Updated : Oct 4, 2023, 8:12 PM IST

NTR Devara Update :జూనియర్ ఎన్​టీఆర్ హీరోగా తెరకెక్కిస్తున్న దేవర చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు దర్శకుడు కొరటాల శివ. మొదటి భాగాన్ని ముందే నిర్ణయించిన తేదీన.. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తామని వెల్లడించారు. భయం అనే ఉద్వేగాన్ని కొత్త కోణంలో చెప్పే కథలో ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వస్తోందని.. నటీనటుల భావోద్వేగాలు, వారి నటన అద్భుతంగా ఉందని కొరటాల శివ తెలిపారు. నటీనటుల భావోద్వేగాలను, కథ గమనాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు కథను రెండు భాగాలుగా చేస్తున్నట్లు కొరటాల స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తారక్ అభిమానులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారని కొరటాల విశ్వాసం వ్యక్తం చేశారు.

డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేసిన వీడియో

"కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది కావడం వల్ల 'దేవర' కథ విషయంలో ఎన్​టీఆర్‌ సహా మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. ఇందులో బలమైన పాత్రలెన్నో ఉన్నాయి. ఎంతో ఉత్సాహంగా చిత్రీకరణ ప్రారంభించిన తర్వాత ఆ ప్రపంచం రోజురోజుకు పెద్దదైపోయింది. కొన్ని షెడ్యూల్స్‌ షూటింగ్‌ ఔట్‌పుట్‌తో మాలో రెట్టింపు ఉత్సాహం కలిగింది. నిడివిని దృష్టిలో పెట్టుకుని ఒక్క సన్నివేశం, ఒక్క సంభాషణ కూడా తొలగించలేమని అంతా ఫీలయ్యాం. ఒక్క పార్ట్‌లో ఇంత పెద్దకథను ముగించేయడం తప్పు అన్న నిర్ణయానికి వచ్చాం. పాత్రలు, వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్‌లో కుదరదనుకున్నా. అందరితో చర్చించి పార్ట్‌ 2 నిర్ణయం తీసుకున్నా"

--కొరటాల శివ, దర్శకుడు

Devara Latest News : అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంత నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్‌ఫుల్‌ పాత్రలో తారక్‌ కనిపించనున్నారు. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ దక్షిణాది చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతోంది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల.. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేశారు.

Janhvi Kapoor Hyderabad House : హైదరాబాద్​లో ఇల్లు కొన్న 'దేవర' బ్యూటీ​.. వామ్మో ఎన్ని కోట్లంటే?

Devara VFX : 'దేవర' షాకింగ్​ న్యూస్​.. రూ.100కోట్ల బడ్జెట్​తో వీఎఫ్​ఎక్స్​ షురూ..

Last Updated : Oct 4, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details